Bunny Vas: మలయాళం వేరు.. తెలుగు వేరు.. కొత్త నిర్మాతలకు బన్నీ వాస్ స్వీట్ వార్నింగ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్‌లో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌పై వరుస విజయాలు అందుకుంటున్న నిర్మాత బన్నీ వాస్, తాజాగా ఇతర భాషల నుంచి వచ్చే నిర్మాతలకు ఒక కీలకమైన సూచన చేశారు. టొవినో థామస్ హీరోగా వస్తున్న ‘పల్లిచట్టంబి’ మూవీ అప్‌డేట్ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలుగులో సినిమా నిర్మించడం అనేది అంత తేలికైన విషయం కాదని కుండబద్దలు కొట్టారు.
Also Read : Biker-Rakasa: ‘బైకర్’, ‘రాక్షస’లకు లైన్ క్లియర్!
Also Read
- LNG Train: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. దేశంలో తొలి LNG రైలుకు గ్రీన్ సిగ్నల్..
- Bank Strike: సెప్టెంబర్ 28 నుంచి మూడు రోజుల బ్యాంక్ సమ్మె.. కారణం ఇదే
- IND Vs WI: సెంచరీతో చెలరేగిన గ్రీవ్స్.. భారత్ ముందు భారీ లక్ష్యం..
- Parvesh Verma Slap Row: ఆప్ ఎమ్మెల్యేతో వాగ్వాదం.. యువకుడిని కొట్టిన ఢిల్లీ మంత్రి..
‘మలయాళంలో సినిమా నిర్మించడం వేరు, తెలుగులో సినిమా నిర్మించడం వేరు. ఇక్కడి మార్కెట్, ఖర్చులు, ప్రేక్షకుల అభిరుచులు చాలా భిన్నంగా ఉంటాయి. తెలుగులో సినిమా చేయడానికి కంగారు పడకండి’ అని బన్నీ వాస్ నిర్మాతలకు సూచించారు. ఒక అనుభవం ఉన్న నిర్మాతగా తాను ఈ మాట చెబుతున్నానని, ఇక్కడ అడుగు వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా, పక్కా ప్లానింగ్‌తో ఉండాలని ఆయన హెచ్చరించారు. ముఖ్యంగా బడ్జెట్ నియంత్రణ, ప్రమోషన్ల విషయంలో తెలుగు ఇండస్ట్రీకి ఉన్న ప్రత్యేకతలను ఆయన గుర్తు చేశారు. కాగా బన్నీ వాస్ చేసిన ఈ కామెంట్స్ చూస్తుంటే.. టాలీవుడ్‌లోకి వస్తున్న కొత్త మేకర్లకు ఆయన ఒక ‘గైడ్’లా చేస్తున్నట్లు అనిపిస్తోంది. టొవినో థామస్ కు తెలుగులో ఉన్న క్రేజ్ దృష్ట్యా ‘పల్లిచట్టంబి’ని ఇక్కడ భారీగా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మరి బన్నీ వాస్ ఇచ్చిన ఈ సలహాను కొత్త నిర్మాతలు ఎంతవరకు తీసుకుంటారో చూడాలి.
తాజావార్తలు
-
LNG Train: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. దేశంలో తొలి LNG రైలుకు గ్రీన్ సిగ్నల్..
-
Bank Strike: సెప్టెంబర్ 28 నుంచి మూడు రోజుల బ్యాంక్ సమ్మె.. కారణం ఇదే
-
Karthi: “డీఎంకే అయినా.. టీవీకే అయినా ఇంతేనా?” విజయ్ సర్కార్‌ను నిలదీసిన హీరో కార్తి!
-
KPHB: హైదరాబాద్‌లో చీటీల పేరిట రూ.16 కోట్ల కుచ్చుటోపీ
-
IND Vs WI: సెంచరీతో చెలరేగిన గ్రీవ్స్.. భారత్ ముందు భారీ లక్ష్యం..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?