NTV Telugu Site icon

New York: నసావు కౌంటీ స్టేడియంను కూల్చివేయడానికి వచ్చిన బుల్డోజర్లు.. ఎందుకో తెలుసా..?

Stadium

Stadium

న్యూయార్క్‌లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం టీ20 ప్రపంచ కప్ 2024 వేదికగా ఎనిమిది మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చింది. న్యూయార్క్ లో క్రికెట్ స్టేడియం లేకపోవడంతో తాత్కలికంగా దీన్ని ఏర్పాటు చేశారు. 250 కోట్ల రూపాయలతో నిర్మించిన నాసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం.. అందరూ ఊహించినట్లుగానే ఇక్కడి పిచ్ బ్యాటర్లుకు పెద్దగా సహకరించలేదు. అయితే.. ఈ స్టేడియంలో బుధవారం జరిగిన ఇండియా-అమెరికా మ్యాచ్ చివరిది. ఆ తర్వాత ఈ స్టేడియాన్ని కూల్చివేయనున్నారు. స్టేడియంను కూల్చివేయడానికి బుల్డోజర్లు సిద్ధంగా ఉన్న వీడియోను ANI సోషల్ మీడియా హ్యాండిల్‌ షేర్ చేసింది. న్యూయార్క్ లోని నాసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం నిర్మాణం ఫిబ్రవరిలో ప్రారంభమైంది. అంటే టోర్నీ ప్రారంభానికి కేవలం 5-6 నెలల ముందు నిర్మాణం చేపట్టారు. ఈ స్టేడియంలో స్టాండ్లతో పాటు అన్ని సౌకర్యాలు అందుబాటులోకి తెచ్చారు.

CBIC RECRUITMENT 2024: న్యాయ విద్యార్థులకు సువర్ణ అవకాశం..

అయితే.. ఆ సమయంలో పిచ్ నిర్మాణం సాధ్యం కాకపోవడంతో డ్రాప్ ఇన్ పిచ్ ట్రిక్‌ను ఉపయోగించారు. ఆస్ట్రేలియాలోని అడిలైడ్‌లోని పిచ్‌ని కూల్చివేసి న్యూయార్క్‌లోని నసావు కౌంటీలో అమర్చారు. అయితే ఇది ఆస్ట్రేలియా పిచ్‌లా ఉంటుందని, బ్యాట్స్‌మెన్‌తో పాటు బౌలర్లకు సహకరిస్తుందని అనుకున్నప్పటికీ అది జరగలేదు. ఈ స్టేడియంలో తక్కువ స్కోరు నమోదయ్యాయి. ఈ పిచ్ గురించి మాట్లాడుకుంటే.. జూన్ 9న భారత్-పాకిస్తాన్ మధ్య ఈ పిచ్ లో హైఓల్టే్జ్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో తక్కువ స్కోరు నమోదైంది. మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు కేవలం 119 పరుగులకే కుప్పకూలింది. అయితే.. తక్కువ స్కోరును సులభంగా ఛేజ్ చేయవచ్చని ఆశించిన పాకిస్తాన్ కు భంగపాటు తప్పలేదు. పాకిస్తాన్ జట్టు 20 ఓవర్లు ఆడి 113 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ మ్యాచ్ తర్వాత న్యూయార్క్ పిచ్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత.. దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లోనూ చాలా తక్కువ స్కోరింగ్‌ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్రికా జట్టు కేవలం 107 పరుగులకే ఆలౌట్ కాగా, డచ్ జట్టు కూడా 103 పరుగులకు ఆలౌటైంది. చివరగా.. న్యూయార్క్ క్రికెట్ స్టేడియం తాత్కాలికంగా నిర్మించబడింది. ఈ వేదికపై జరిగే ప్రపంచ కప్ మ్యాచ్‌లు భవిష్యత్తులో మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వడానికి ఈ స్టేడియం సరిపోదని స్పష్టం చేశాయి.