NTV Telugu Site icon

Bull In Bank: ఎస్‌బీఐ బ్యాంకులోకి ఎద్దు.. వీడియో వైరల్!

Bull In Sbi Bank

Bull In Sbi Bank

Bull enters SBI Branch in Unnao: ఓ ఎద్దు బ్యాంకులోకి ప్రవేశించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఎద్దు బ్యాంకులోకి రాగానే లోపల ఉన్న వారందరూ అక్కడి నుంచి పరుగులు తీశారు. బ్యాంకు లోపల ఎద్దు కనిపించడంతో అక్కడ గందరగోళం నెలకొంది. ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లోని చోటుచేసుకుంది. ఈ వీడియో చూసిన అందరూ లైకుల వర్షం కురిపిస్తూ.. ఫన్నీగా కామెంట్స్ పెడుతున్నారు.

Also Read: Amazon Republic Day Sale 2024: పండగ రోజే అమెజాన్‌ రిపబ్లిక్‌ డే సేల్‌ ఆరంభం.. ఈ మొబైల్‌లపై భారీ డిస్కౌంట్స్!

ఉన్నావ్‌లోని కొత్వాలి బడా కుడాలి వద్ద ఉన్న స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ)లోకి బుధవారం మధ్యాహ్నం ఓ ఎద్దు ప్రవేశించింది. షాహ్‌గంజ్ ఎస్‌బీఐ బ్యాంకు తలుపులు తెరిచి ఉండగా.. చలికి తట్టుకోలేని ఓ ఎద్దు లోపలికి వచ్చింది. ఎద్దును చూసిన బ్యాంకు సిబ్బంది, కస్టమర్లు పరుగులు తీశారు. బ్యాంకులోకి వచ్చిన ఎద్దు కాసేపు నిలబడింది. అది ఎవరికీ ఎలాంటి హాని తలపెట్టలేదు. కాసేపటికి సెక్యూరిటీ గార్డు వచ్చి ఎద్దును బ్యాంకు నుంచి తరిమికొట్టాడు. దాంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ వీడియోను కుమార్ మనీష్ (Kumar Manish) అనే ఎక్స్ ఖాతా దారుడు పోస్ట్ చేశాడు.

Show comments