Bugatti Tourbillon top speed is 445 kmph: ఫ్రాన్స్‌కు చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ బుగాటీ ఆటోమొబైల్స్ సరికొత్త కారును ఆవిష్కరించింది. తోబియాన్ హైపర్-జీటీ హైబ్రిడ్ కారును ఆవిష్కరించింది. బుగాటీ చిరాన్, వేరాన్‌లను పోలి ఉన్నప్పటికీ.. ఇది పూర్తిగా కొత్త కారు. ఈ కారు సరికొత్త ఛాసిస్, కొత్త సస్పెన్షన్, కొత్త కాస్‌వర్త్ పవర్డ్ ఇంజన్‌ను కలిగి ఉంటుంది. బుగాటీ రిమాక్ వెంచర్‌లో ఇది మొదటి కారు.
బుగాటీ కొత్త కారు గంటకు 445 కిలోమీటర్ల గరిష్ఠ వేగంతో దూసుకెళుతుంది. దాంతో ప్రపంచంలోనే రోడ్లపై అత్యంత వేగంగా ప్రయాణించే వాహనంగా ఇది గుర్తింపు పొందనుంది. ఈ కారు ధర 40 మిలియన్ డాలర్లు (సుమారు రూ.34 కోట్లు). ఈ అత్యాధునిక కారుకు 8.3 లీటర్ వీ16 ఇంజిన్‌ను అమర్చారు. దాంతో 1000 హెచ్‌పీ శక్తిని ఇస్తుంది. క్వాడ్ టర్బో డబ్ల్యూ 16 విద్యుత్తు మోటార్‌తో అదనంగా 800 హెచ్‌పీ శక్తి లభిస్తుంది.
Also Read: Babar Azam-PCB: ఆ క్రికెటర్‌పై లీగల్ యాక్షన్‌కు సిద్దమైన బాబర్ అజామ్!
బుగాటీ కొత్త కారులో 25 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఉంది. ఈ కారు 1995 కిలోల బరువు మాత్రమే ఉంటుంది. ఈ కార్లను మొత్తం 250 మాత్రమే రూపొందిస్తామని కంపెనీ ప్రకటించింది. చిరోన్, వేరాన్ అత్యంత ప్రసిద్ధ చెందిన హైపర్ కార్‌ల జాబితాలో ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన కార్లుగా రికార్డులు సృష్టించాయి. ఇప్పుడు తోబియాన్ వాటిని అధిగమించనుంది. 2026 వరకు ఈ కారు డెలివరీలను కంపెనీ ప్రారంభించదు.