NTV Telugu Site icon

Poco M6 Plus 5g Price: పోకో నుంచి సూపర్ స్మార్ట్‌ఫోన్‌.. తక్కువ బడ్జెట్‌లో సూపర్ కెమెరా, భారీ బ్యాటరీ!

Poco M6 Plus 5g Price

Poco M6 Plus 5g Price

Poco M6 Plus Launch Date and Price in India: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ కంపెనీ ‘షావోమీ’ సబ్‌బ్రాండ్‌ ‘పోకో’ నుంచి మరో స్మార్ట్‌ఫోన్ రిలీజ్ అవుతోంది. ‘పోకో ఎం6 ప్లస్’ పేరుతో కంపెనీ బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేస్తోంది. ఆగష్టు 1న భారత మార్కెట్‌లో ఎం6 ప్లస్ రిలీజ్ కానుంది. ఈ ఫోన్ అమ్మకాలు ఈ కామర్స్ సైట్స్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలో అందుబాటులో ఉండనున్నాయి. శక్తిమంతమైన ఫీచర్లతో వస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్‌ ధర రూ.15 వేల లోపే అని తెలుస్తోంది.

నివేదికల ప్రకారం.. పోకో ఎం6 ప్లస్ ఫోన్ 120 Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7 ఇంచెస్ ఐపీఎస్ ఎల్‌సీడీ ఫుల్‌హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్లేతో వస్తుంది. 1080×2460 పిక్సెల్స్ రిజొల్యూషన్, 850 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఈ స్క్రీన్ సొంతం. స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 అడ్వాన్స్‌డ్ ఎడిషన్ విత్ 2.2 గిగా హెర్ట్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్ ఉంటుంది. ఆండ్రాయిడ్ 14 హైపర్ ఓఎస్ కస్టమ్ యూఐ వర్షన్ ఇందులో ఉండనుంది. బెటర్ గేమింగ్, మల్టీ మీడియా ఎక్స్ పీరియన్స్ కోసం అడ్రెనో జీపీయూతో గ్రాఫిక్స్ కార్డు ఉంటుంది.

Also Read: Gold Rate Today: మళ్లీ షాకిస్తున్న బంగారం ధరలు.. నేడు తులం ఎంతంటే?

పోకో ఎం6 ప్లస్ ఫోన్ వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. 108 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఎఫ్/1.75 ఎపర్చర్‌తో ఉంటుంది. 3x ఇన్-సెన్సార్ జూమ్‌కు మద్దతు ఇస్తుంది. రింగ్ ఎల్‌ఈడీ ఫ్లాష్ లైట్ కూడా ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 13 మెగా పిక్సెల్ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ 33 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5030 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తోంది. భారతదేశంలో ఎం6 ప్లస్ ధర రూ.13,000 నుండి రూ.15,000 వరకు ఉండవచ్చు. ఆగష్టు 1న పూర్తి డీటెయిల్స్ తెలియరానున్నాయి. ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ 5G ఫోన్ అని చెప్పాలి.