Site icon NTV Telugu

Budget-2024: వందే భారత్‌ కోచ్‌ల తరహాలో కొత్తగా 40 వేల బోగీలు

Train

Train

Nirmala Sitharaman: మధ్యంతర బడ్జెట్‌ లో రైళ్లు, విమానయానరంగానికి సంబంధించి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కీలక ప్రకటన చేశారు. రైల్వేల బలోపేతానికి కేంద్ర సర్కార్ అనేక కీలక చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ప్రధాన మంత్రి గతిశక్తి పథకం కింద 3 కారిడార్లను నిర్మిస్తామని బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. ఇంధనం, ఖనిజాలు, సిమెంట్ కోసం మూడు రైల్వే కారిడార్లను నిర్మించనున్నట్లు ప్రకటించారు. వందే భారత్‌ను అప్‌గ్రేడ్ తో పాటు రాబోయే రోజుల్లో ప్రభుత్వం దేశంలోని ఇతర నగరాలలో మెట్రో రైలు నమో భారత్‌ అనుసంధానిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.

Read Also: KCR: అసెంబ్లీ వద్ద సందడి.. గజ్వేల్ ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణస్వీకారం

ఇక, పలు నగరాల్లో ప్రారంభించిన వందేభారత్ రైళ్లను పెద్ద ఎత్తున అప్‌గ్రేడ్ చేయనున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. వందే భారత్‌ తరహాలో కొత్తగా 40 వేల బోగీలను అప్‌గ్రేడ్ చేయనున్నట్లు ప్రకటించారు. తద్వారా ప్రయాణికుల భద్రత, సౌకర్యాలను మరింత పెంచనున్నట్లు చెప్పారు. దేశంలోని వివిధ నగరాలను మెట్రో రైలు, నమో భారత్‌తో అనుసంధానించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆమె అన్నారు. విమానయాన రంగంపై సైతం సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేసింది. వచ్చే పదేళ్లలో కొత్త విమానాశ్రయాలను ప్రారంభిస్తామన్నారు. ప్రభుత్వం దశాబ్దకాలంలో విమానాశ్రయాల సంఖ్యను 149కి పెంచబోతుందని తెలిపింది. ఉడాన్ పథకం కింద 517 కొత్త మార్గాలను అనుసంధానించి.. టైర్-2, టైర్-3 నగరాల్లో ఉడాన్ పథకం సక్సెస్ అయిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు.

Exit mobile version