Murder: ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్‌లో ఓ అవమానకరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి హత్య కేలులో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నేరం మృతుడి భార్యేనని తేలింది. ఆమె ప్రియుడితో కలిసి భర్తను మట్టుబెట్టింది. ప్రేమికుడితో కలిసి, తన భర్తను గొంతు నులిమి చంపింది. పోలీసుల విచారణలో నిందితులిద్దరూ నేరాన్ని అంగీకరించారు. ఆశ్చర్యకరమైన విషయాలు వెల్లడించారు.
READ MORE: Russia Airspace Violation: రష్యా బరితెగింపు.. దీటుగా స్పందించిన నాటో కూటమి..
బదౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ సంఘటన మూడు రోజుల క్రితం సెప్టెంబర్ 17న జరిగింది. సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని లోహ్రా బహేరి నివాసి చోటే లాల్ కుమారుడు భూపేంద్ర సెప్టెంబర్ 17న అనుమానాస్పద స్థితిలో హత్యకు గురయ్యాడు. భూపేంద్రను గొంతు నులిమి చంపారు. మృతుడి తల్లి తన కోడలు రాజకుమారిపై అనుమానం వ్యక్తం చేసింది. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా.. పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు మృతుడి భార్యను పర్యవేక్షించడం ప్రారంభించారు. ఇంతలో శుక్రవారం ఆమె తన ప్రేమికుడు బల్వీర్‌తో షేఖుపూర్‌కు వెళ్లే మార్గంలో కనిపించింది. వీరి కలయిక పోలీసుల అనుమానాలను మరింత తీవ్రతరం చేసింది. దీంతో పోలీసులు వారిద్దరినీ అదుపులోకి తీసుకుని కఠినంగా విచారించారు.
READ MORE: Tirupati : తిరుపతిలో షాకింగ్ సంఘటన.. మద్యం మత్తులో పాము తల కొరికిన వ్యక్తి
విచారణలో భార్య రాజకుమారి నిజం ఒప్పుకుంది. తన భర్త మద్యం తాగి తనను తరచుగా కొట్టేవాడని.. కొంతకాలం క్రితం.. అతనిపై కేసు కూడా పెట్టానని చెప్పింది. ఎంతకీ వినకపోవడంతో హత్య చేసినట్లు వెల్లడించింది. ఇది మాత్రమే కాదు.. ఆమె తన పొరుగున్న ఉన్న బల్వీర్ తో వివాహేతర బంధం కలిగి ఉన్నట్లు అంగీకరించింది. సెప్టెంబర్ 17న తన భర్త మద్యం తాగి తనపై దాడి చేశాడని రాజకుమారి చెప్పింది. కోపంతో బల్వీర్ కు ఫోన్ చేసింది. వారిద్దరూ కలిసి భూపేంద్రను టవల్ తో గొంతు బిగించి చంపేశారు. భూపేంద్ర హత్యలో పాల్గొన్న బల్వీర్ కూడా పోలీసుల విచారణలో తనకు, రాజకుమారికి అక్రమ సంబంధం ఉందని ఒప్పుకున్నాడు. పోలీసులు నిందితురాలైన మహిళను, ఆమె ప్రేమికుడిని జైలుకు పంపారు.
