Site icon NTV Telugu

PEDDI : బుచ్చి బర్త్ డే ‘పెద్ది’ స్పెషల్ వీడియో రిలీజ్

 ఉప్పెన’ చిత్రంతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు బుచ్చిబాబు సానా. అదే జోష లో ఇప్పుడు మెగా పవర్ సార్ రామ్ చరణ్ తో పెద్ది సినిమా చేస్తున్నాడు బుచ్చి. కాగా నేడు నేడు బుచ్చి బాబు పుట్టినరోజు . ఈ సందర్భంగా ఆయనకు చిత్ర పరిశ్రమ ప్రముఖులతో పాటు అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ పుట్టినరోజును మరింత ప్రత్యేకం చేస్తూ ఆయన దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ పెద్ది‘ నుండి స్పెషల్ వీడియో రిలీజ్ చేసారు మేకర్స్.

 “బుచ్చిబాబు ఒక రా అండ్ రస్టిక్ అద్భుతాన్ని వెండితెరపై ఆవిష్కరిస్తున్నారు. ఈ సినిమా కేవలం పోటీ ఇవ్వడానికి రావడం లేదు.. బాక్సాఫీస్‌ను జయించడానికి వస్తోంది” అంటూ  వీడియోను పోస్ట్ చేసారు మేకర్స్. రామ్ చరణ్‌ను మునుపెన్నడూ చూడని అత్యంత ఊర మాస్ లుక్‌లో ఈ సినిమాలో చూపించబోతున్నట్లు తెలుస్తోంది. మెగా ఫాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న ఈ పాన్-ఇండియా చిత్రం ఈ ఏడాదిఏప్రిల్ 30వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. వేసవి సెలవులను టార్గెట్ చేస్తూ వస్తున్న ఈ సినిమా తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ మరియు మలయాళ భాషల్లో భారీ స్థాయిలో విడుదల కాబోతోంది. ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా వృద్ధి సినిమాస్ & మైత్రి మూవీస్ తో సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా  నిర్మిస్తున్నాయి. బుచ్చిబాబు సానా తన అద్భుతమైన కథా బలంతో రామ్ చరణ్‌కు మరో ‘రంగస్థలం’ మించిన విజయాన్ని అందిస్తారని మెగా అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు

Exit mobile version