Site icon NTV Telugu

Kotha Manohar Reddy: మహేశ్వరంలో కొత్త మనోహర్ రెడ్డికి బ్రహ్మ రథం పడుతున్న ప్రజలు

Bsp Mla

Bsp Mla

మహేశ్వరం నియోజకవర్గంలో ఏనుగు పార్టీ దూసుకుపోతుంది. నియోజకవర్గంలో బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త మనోహర్ రెడ్డికి స్థానిక ప్రజలు కేఎంఆర్ ట్రస్ట్ లబ్ధిదారులు, మహిళలు, అభిమానులు, పార్టీ కార్యకర్తలు బ్రహ్మరథం పడుతున్నారు. ఇవాళ ప్రచార కార్యక్రమంలో భాగంగా మహేశ్వరం నియోజకవర్గంలోని గుమ్మడవెల్లి, మాదాపూర్, తిమ్మాపూర్, రాచాలురు, లేమూరు, సరస్వతి గూడా మీదుగా ఆయన పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా ఓటర్లను కలిసి వచ్చే ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించాలని మహేశ్వరం బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్ధి కొత్త మనోహర్ రెడ్డి కోరారు.

Read Also: Physical Harassment: ఆగ్రాలో దారుణం.. హోటల్‌లో పనిచేసే మహిళపై సామూహిక అత్యాచారం

ఈ సందర్బంగా కొత్త మనోహర్ రెడ్డి మాట్లాడుతూ.. పదవి లేకపోయినా నిరంతరం పేద ప్రజల మధ్య ఉంటూ కేఎంఆర్ ట్రస్ట్ ద్వారా ఉచితంగా 3000 మంది నిరుపేదలకు 60 గజాల ఇంటిస్థలం అందజేశానని.. తాను గెలిచిన వెంటనే మహేశ్వరం నియోజక వర్గంలోని నిరు పేదలను గుర్తించి వారికి కూడా 60 గజాల ఇంటి స్థలాన్ని అందజేస్తానని ఆయన వెల్లడించారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి కబ్జా చేసిన భూములన్నీ తిరిగి పేద ప్రజలకు పంచి పెడతానని కొత్త మనోహర్ రెడ్డి హామీ ఇచ్చారు. ఎప్పుడు మీతోనే ఉండి.. ఆపద వచ్చినప్పుడు కూత వేటు దూరంలో ఉండే నాయకుడు కావాలా.. లేక ఎలక్షన్ లు రాగానే అధికార దాహంతో విచ్చల విడిగా డబ్బులు, మందు, పంచి మళ్లీ ఎన్నికల తర్వాత కనిపించకుండ పోయే నాన్ లోకల్ లీడర్లు కావాలా మీరే తేల్చుకోవాల అని కొత్త మనోహర్ రెడ్డి పేర్కొన్నారు.

Exit mobile version