NTV Telugu Site icon

BSNL Recharge: ఆలోచించిన ఆశాభంగం.. ఊహించని ధరకి 14 నెలల వ్యాలిడిటీ

Bsnl

Bsnl

BSNL Recharge: ప్రస్తుతం ప్రైవేట్ టెలికాం సంస్థలు వినియోగదారులను ఆకర్షించడానికి అనేక కొత్త ఆఫర్లను తీసుకువస్తున్నాయి. అయితే, ఈ ఆఫర్లు సాధారణంగా ధరల పెరుగుదలతో కూడినవి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్ తక్కువ ధరల్లో అద్భుతమైన ప్లాన్లను అందిస్తోంది. తాజా ఆఫర్‌లో బీఎస్ఎన్ఎల్ ఒక ప్రత్యేక ప్లాన్‌పై 14 నెలల వరకు వ్యాలిడిటీని అందించే ప్లాన్ ను అందిస్తోంది. ఈ నేపథ్యంలోనే బీఎస్ఎన్ఎల్ రూ.2,399 రీఛార్జ్ ప్లాన్ కు మరో ఒక నెల ఉచిత వ్యాలిడిటీని అదనంగా ప్రకటించింది. ఇదివరకు ఈ ప్లాన్‌కు 395 రోజులు (13 నెలలు) వ్యాలిడిటీగా ఉండేది. తాజాగా ఈ ప్లాన్‌ను 425 రోజులు (14 నెలలు) వ్యాలిడిటీగా మారింది.

Also Read: Oneplus12 Offer: త్వరపడండి.. వన్‌ప్లస్ 12పై భారీ తగ్గంపు

ఈ ప్లాన్‌లో వినియోగదారులకు లోకల్, రోమింగ్ సేవలు రెండింటికీ అన్‌లిమిటెడ్ కాల్స్ ఉంటాయి. రోజుకు 2GB డేటా చొప్పున మొత్తం 850GB డేటా లభిస్తుంది. రోజువారీ డేటా పూర్తయిన తర్వాత 40kbps వేగంతో అన్‌లిమిటెడ్ డేటా అందుబాటులో ఉంటుంది. అలాగే రోజుకు 100 SMSలు ఉచితంగా లభిస్తాయి. ప్రస్తుతం బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలను దేశవ్యాప్తంగా విస్తరించేందుకు వేగంగా పనిచేస్తోంది. 2025 నాటికి 4జీ సేవలతో పాటు 5జీ సేవలను కూడా అందించనున్నట్లు బీఎస్ఎన్ఎల్ ప్రకటించింది. బీఎస్ఎన్ఎల్ రూ.2,399 ప్లాన్‌కు ఈ ప్రత్యేక ఆఫర్ జనవరి 16, 2025 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. కాబట్టి, తక్కువ ధరలో ఎక్కువ ప్రయోజనాలను కోరుకునే వారు ఈ ఆఫర్‌ను వెంటనే ఉపయోగించుకోవాలి. ఈ ప్లాన్ ధర ఇతర టెలికామ్ సమస్థల రీఛార్జ్ లతో పోలిస్తే దాదాపు వెయ్యి రూపాల వరకు తక్కువ. మొత్తానికి తక్కువ ధరలో అధిక ప్రయోజనాలతో బీఎస్ఎన్ఎల్ ప్లాన్ ప్రస్తుత మార్కెట్లో ఒక ఉత్తమ ఎంపిక. 14 నెలల వ్యాలిడిటీతో పాటు డేటా, కాలింగ్, SMS సౌకర్యాలు అన్నీ వినియోగదారులకు మరింత ఉపయోగకరంగా ఉంటాయి.

Show comments