Site icon NTV Telugu

BSNL Recruitment 2026: బీఎస్ఎన్ఎల్ లో సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులు.. మంచి జీతం..

Jobs

Jobs

కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ లో భారీ స్థాయిలో సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. మొత్తం 120 పోస్టులను భర్తీ చేయనున్నారు. సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (DR) టెలికాం – 95 పోస్టులు, సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (DR) ఫైనాన్స్ – 25 పోస్టులు భర్తీ కానున్నాయి. BE/B.Tech, CA/CMA ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ వెబ్‌సైట్ (https://bsnl.co.in/)కి వెళ్లి ఆన్‌లైన్ ఫారమ్‌ను పూర్తి చేయాలి. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ 05.02.2026 ఉదయం 10.00 గంటలకు ప్రారంభమై 07.03.2026 ఉదయం 10.00 గంటలకు ముగుస్తుంది. పూర్తి వివరాలకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.

విద్యార్హతలు

సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (DR) టెలికాం స్ట్రీమ్ –

బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ / బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ డిగ్రీ లేదా తత్సమాన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్, కింది స్ట్రీమ్‌లలో దేనిలోనైనా రెగ్యులర్ ఫుల్ టైం ప్రాతిపదికన కనీసం 60% మార్కులతో: –
ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్
ఎలక్ట్రానిక్స్
కంప్యూటర్ సైన్స్
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ
విద్యుత్
ఇన్స్ట్రుమెంటేషన్

సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (DR) ఫైనాన్స్ స్ట్రీమ్ –

చార్టెడ్ అకౌంటెంట్ (CA)
కాస్ట్ అండ్ మేనేజ్‌మెంట్ అకౌంటెన్సీ (CMA)

వయోపరిమితి: (07.03.2026 నాటికి)

అభ్యర్థికి కనీసం 21 సంవత్సరాలు ఉండాలి, 30 సంవత్సరాలు మించకూడదు. SC/ST దరఖాస్తుదారులకు +5 సంవత్సరాలు, OBC దరఖాస్తుదారులకు +3 సంవత్సరాలు, పిడబ్ల్యుబిడి (జనరల్/ఇడబ్ల్యుఎస్) దరఖాస్తుదారులకు +10 సంవత్సరాలు, పిడబ్ల్యుబిడి (ఎస్సీ/ఎస్టీ) దరఖాస్తుదారులకు +15 సంవత్సరాలు, పిడబ్ల్యుబిడి (ఓబిసి) దరఖాస్తుదారులకు: +13 సంవత్సరాలు, మాజీ సైనికుల దరఖాస్తుదారులకు ప్రభుత్వ విధానం ప్రకారం వయోసడలింపు ఉంటుంది.

జీతం స్కేల్

సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (DR) టెలికాం స్ట్రీమ్ – E-3 రూ. 24900 – 50500/-
సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (DR) ఫైనాన్స్ స్ట్రీమ్ – E-3 రూ. 24900 – 50500/-

ఎంపిక విధానం

ఆన్‌లైన్ పరీక్ష
డాక్యుమెంట్ వెరిఫికేషన్

దరఖాస్తు ఫీజు

ST/SC/PWD దరఖాస్తుదారులకు – రూ.1250/-
ఇతర దరఖాస్తుదారులకు – రూ.2500/-
చెల్లింపు మోడ్: ఆన్‌లైన్

Exit mobile version