BSNL Installation Charges Waived Off: ప్రభుత్వరంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్‌ఎన్‌ఎల్) ఒకప్పుడు భారతదేశంలో బ్రాడ్‌బ్యాండ్ సేవలకు రారాజు. అయితే భారతీ ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో రాకతో బీఎస్‌ఎన్‌ఎల్ మార్కెట్ పడిపోయింది. దీంతో కస్టమర్లకు ఆకర్షించడం కోసం ఎప్పటికపుడు పలు రకాల ఆఫర్లతో ముందుకొస్తోంది. ఈ క్రమంలోనే బీఎస్‌ఎన్‌ఎల్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. 2025 మార్చి 31 వరకు కొత్త కనెక్షన్ తీసుకునేవారి నుంచి ఎలాంటి ఇన్‌స్టలేషన్ ఛార్జీ వసూలు చేయని పేర్కొంది.
భారత్ ఫైబర్‌తో పాటు ఎయిర్‌ఫైబర్ వినియోగదారులకు ఇన్‌స్టలేషన్ ఛార్జీలను ఎత్తివేస్తునట్లు బీఎస్‌ఎన్‌ఎల్ ప్రకటించింది. దాంతో ఈ రెండు కనెక్షన్ తీసుకున్న వారు ఇక నుంచి రూ.500 ఇన్‌స్టలేషన్ ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. మరోవైపు కాపర్ కనెక్షన్లపై రూ.250 ఇన్‌స్టలేషన్ ఛార్జీలు కూడా ఉండవు. భారత్ ఫైబర్ ప్లాన్స్ నెలకు రూ.249 నుంచి ఆరంభం అవుతాయి. ఈ ప్లాన్‌లో యూజర్లు 10 ఎంబీపీఎస్ వేగంతో 10 జీబీ డేటాను పొందుతారు. పరిమితి ముగిసిన అనంతరం వేగం తగ్గుతుంది.
Also Read: Hardik Pandya: హార్దిక్ పాండ్యాకు బిగ్ షాక్.. మ్యాచ్ నిషేధం తప్పదా?
ప్రస్తుతం ప్రైవేటు టెలికాం కంపెనీలు భారతీ ఎయిర్‌టెల్, రిలయన్స్ జియోలు ఇన్‌స్టలేషన్ ఛార్జీలను వసూలు చేయడం లేదు. అయితే ఇన్‌స్టలేషన్ ఛార్జీలు ఉండకూడదంటే.. కచ్చితంగా దీర్ఘకాల ప్లాన్లను రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. బీఎస్‌ఎన్‌ఎల్‌లో మాత్రం అలాంటి షరతులేమీ లేవు. ఏ ప్లాన్ ఇన్‌స్టలేషన్‌కు ఛార్జీలను వసూలు చేయడం లేదు.