Site icon NTV Telugu

దేశవ్యాప్తంగా BSNL VoWiFi సేవలు ప్రారంభం.. స్పష్టమైన కాల్స్ కోసం ఎలా యాక్టివేట్ చేసుకోవాలంటే..?

Bsnl Vowifi

Bsnl Vowifi

BSNL VoWiFi: భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) కొత్త సంవత్సరం సందర్భంగా దేశవ్యాప్తంగా తన Voice over Wi-Fi (VoWiFi) సేవలను అధికారికంగా ప్రారంభించింది. Wi-Fi కాలింగ్\ గా కూడా పిలవబడే ఈ ఫీచర్ ఇప్పుడు భారత్‌లోని అన్ని టెలికాం సర్కిళ్లలో వినియోగదారులకు అందుబాటులోకి వచ్చినట్లు సంస్థ ప్రకటించింది. ఈ VoWiFi టెక్నాలజీ ద్వారా వినియోగదారులు మొబైల్ నెట్‌వర్క్ బలహీనంగా ఉన్న చోట్ల కూడా Wi-Fi నెట్‌వర్క్ సహాయంతో కాల్స్ చేయడం, స్వీకరించడం ఇంకా మెసేజెస్ పంపడం సాధ్యమవుతుంది.

పోర్టబుల్ ప్రొజెక్టర్‌లో కొత్త చాప్టర్.. AI ఫీచర్లతో Samsung The Freestyle+ గ్లోబల్ లాంచ్..!

BSNL అధికారికంగా తెలిపిన వివరాల ప్రకారం.. ఈ సేవ IMS (IP Multimedia Subsystem) ఆధారిత ప్లాట్‌ఫామ్‌పై పనిచేస్తుంది. దీని వల్ల Wi-Fi నెట్‌వర్క్ నుంచి మొబైల్ నెట్‌వర్క్‌కు, లేదా అందుబాటులో లేనప్పటికీ కాల్ నిరవధికంగా కొనసాగుతుంది. ఈ ఫీచర్ ప్రత్యేకంగా వినియోగదారుడి ప్రస్తుత మొబైల్ నంబర్, ఫోన్‌లోని నేటివ్ డయలర్లోనే పనిచేస్తుంది. అందువల్ల మూడో పక్ష యాప్‌లను డౌన్‌లోడ్ చేయాల్సిన అవసరం లేకుండా, రిజిస్ట్రేషన్ ప్రక్రియలు కూడా అవసరం ఉండవు.

50MP ట్రిపుల్ కెమెరా, 90W ఫాస్ట్ చార్జింగ్, స్లిమ్ డిజైన్ తో Moto X70 Air Pro లాంచ్‌కు రెడీ..!

ఈ VoWiFi సేవలకు అదనపు చార్జీలు లేవు. ఈ సేవను ఉపయోగించేందుకు వినియోగదారులు VoWiFi సపోర్ట్ చేసే స్మార్ట్‌ఫోన్‌ను కలిగి ఉండాలి. అలాగే మాన్యువల్‌గా ఫీచర్‌ను ఆన్ చేయాలి. మని అందుకోసం ఎలా యాక్టివేట్ చేసుకోవాలంటే..

* ఫోన్‌లో Settings ఓపెన్ చేయండి.
* Network / Connections ఎంపికను ఎంచుకోండి.
* Wi-Fi Calling ఆప్షన్‌ను On చేయండి.

Exit mobile version