NTV Telugu Site icon

BSNL Recharge Plans: బీఎస్‌ఎన్‌ఎల్‌లో కొత్త ప్రీపెయిడ్‌ ప్లాన్స్!

BSNL Launches Rs 58 Plan: ప్రభుత్వరంగ టెలికాం సంస్థ భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (బీఎస్ఎన్ఎల్) తన ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం కొత్త ప్లాన్‌లను తీసుకొచ్చింది. రూ.58, రూ.59 ప్లాన్‌లను బీఎస్ఎన్ఎల్ తీసుకొచ్చింది. ఈ రెండిలో ఒకటి డేటా వోచర్‌ కాగా.. మరొకటి వ్యాలిడిటీ పొడగింపు ప్లాన్‌. ఈ రెండు ప్లాన్‌ల ప్రయోజనాలతో పాటు పూర్తి వివరాలు చూద్దాం.

బీఎస్‌ఎన్‌ఎల్‌ రూ.58 ప్లాన్‌ డేటా వోచర్‌ ప్లాన్. ఈ ప్లాన్ పొందాలంటే కచ్చితంగా బేస్‌ ప్లాన్‌ ఉండాల్సిందే. దీని వ్యాలిడిటీ ఏడు రోజులు. ప్రతిరోజూ 2జీబీ డేటా లభిస్తుంది. 2జీబీ డేటా అయిపోయిన తర్వాత స్పీడ్ 40 Kbpsకు తగ్గిపోతుంది. ఇక రూ.59 ప్లాన్‌ వ్యాలిడిటీ పొడగింపు ప్లాన్‌. దీని వ్యాలిడిటీ ఏడు రోజులు. ఇందులో ఎసెమ్మెస్‌ ప్రయోజనాలు ఉండవు. రోజుకు 1జీబీ డేటా లభిస్తుంది. అపరిమిత వాయిస్‌ కాలింగ్ ఉంటుంది.

Also Read: Voter Slip: మీరు ఇంకా ఓటర్‌ స్లిప్‌ తీసుకోలేదా.. టెన్షన్ వద్దు! మొబైల్‌లోనే ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి

ఇటీవల సినిమాప్లస్‌ ఓటీటీ ప్యాకేజీ ప్రారంభ ధరను బీఎస్ఎన్ఎల్ సగానికి తగ్గించిన విషయం తెలిసిందే. స్టార్టర్ ప్యాక్‌ ధరను రూ.49కు కుదించింది. ఈ ప్యాక్‌ కోసం కంపెనీ గతంలో నెలకు రూ.99 వసూలు చేసింది. ఈ ప్యాక్‌లో లయన్స్‌గేట్‌, షెమరూమీ, హంగామా, ఎపిక్‌ ఆన్‌ ఓటీటీల్లోని కంటెంట్‌ను ఎంజాయ్‌ చేయొచ్చు. జీ5, సోనీలివ్‌, యప్‌టీవీ, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌తో కూడిన ఫుల్‌ ప్యాక్ ప్యాకేజీ కూడా అందుబాటులో ఉంది. ఈ ఫుల్‌ ప్యాక్ ధర నెలకు రూ.199గా ఉంది. రూ.249 ప్రీమియం ప్యాక్‌లో జీ5, సోనీ లివ్‌, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌, యప్‌టీవీ, లయన్స్‌గేట్‌, షెమరూమీ, హంగామా వంటి ఓటీటీ కంటెంట్‌ను ఎంజాయ్‌ చేయొచ్చు.