NTV Telugu Site icon

BSNL Recharge: ఈ రోజు మాత్రమే.. చౌకమైన ధరకు 365 రోజుల ప్లాన్.. ఏకంగా 600జీబీ డేటాతో

Bsnl

Bsnl

BSNL Recharge: ఈ దీపావళికి, జియో, ఎయిర్టెల్, Vi వంటి పెద్ద టెలికాం కంపెనీలు తమ కస్టమర్లను ఆకర్షించడానికి కొత్త ప్లాన్‌లను ప్రారంభించాయి. అయితే, ఈసారి ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ కూడా అదే ప్లాన్ అమలు చేసింది. జూలైలో జియో, ఎయిర్టెల్, Vi లు తమ రీచార్జ్ ప్లాన్‌ల ధరలను పెంచినప్పుడు, చాలా మంది బిఎస్ఎన్ఎల్ వైపు వచ్చారు. ఈ నేపథ్యంలో దీపావళి రోజున, బిఎస్ఎన్ఎల్ కొత్త ఆఫర్‌ను ప్రారంభించింది. ఇది దీపావళి తర్వాత కూడా కొనసాగుతుంది. అయితే ఆ ఆఫర్ కు ఈ రోజు ఆఫర్‌కి చివరి తేదీ. ఈ ఆఫర్ అక్టోబర్ 28 నుండి నవంబర్ 7 వరకు అమలులో ఉంటుంది. ఈ ఆఫర్ కింద రూ.1999 రీఛార్జ్ చేసుకుంటే ఫ్లాట్ రూ.100 తగ్గింపు లభిస్తుంది. అంటే రూ.1899 మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్లాన్‌లో మీరు ఏడాది పొడవునా 600GB డేటా, అపరిమిత కాలింగ్ ఇంకా రోజు 100 SMSలను పొందుతారు.

Read Also: Bank FD Scheme: 7.55% వడ్డీ రేటుతో అదిరిపోయే ఎఫ్‭డి స్కీములను తీసుకొచ్చిన ఇండియన్ బ్యాంకు

బిఎస్ఎన్ఎల్ తన ట్విట్టర్ ఖాతాలో కొత్త ఆఫర్‌ను షేర్ చేసింది. ఈ ఆఫర్ కింద రూ.1999 రీఛార్జ్ చేసుకుంటే రూ.100 తగ్గింపు లభిస్తుంది. అంటే రూ.1899 మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్లాన్‌లో మీరు ఏడాది పొడవునా 600GB డేటా, అపరిమిత కాలింగ్, మరెన్నో పొందుతారు. ఈ ఆఫర్ నవంబర్ 7 వరకు వర్తిస్తుంది. ఐకమరోవైపు బిఎస్ఎన్ఎల్ చౌకైన ప్లాన్‌లను అందించడమే కాకుండా, కొత్త టెక్నాలజీపై కూడా పని చేస్తోంది. బిఎస్ఎన్ఎల్ కొత్త టెక్నాలజీపై ‘Viasat’ తో కలిసి పనిచేసింది. దీని ద్వారా ప్రజలు సిమ్ కార్డ్ లేకుండా కూడా ఫోన్ కాల్స్, వీడియో కాల్స్ చేయగలరు. అత్యవసర పరిస్థితుల్లో ఈ టెక్నాలజీ చాలా ఉపయోగపడుతుంది.

Show comments