Site icon NTV Telugu

BSNL Azadi Ka Plan: నెవ్వర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్! కేవలం రూ.1కే 30 రోజులు అన్లిమిటెడ్ డేటా, కాల్స్!

Bsnl Azadi Ka Plan

Bsnl Azadi Ka Plan

BSNL Azadi Ka Plan: ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు ఒక సంచలనాత్మక ప్రీపెయిడ్ ఆఫర్‌ను తీసుకొచ్చింది. దీనికి “ఆజాదీ కా ప్లాన్” (Azadi Ka Plan) అనే పేరును పెట్టారు. ఈ ప్లాన్ కేవలం రూ.1కి అందుబాటులో ఉండటం ఇప్పుడు సంచలనంగా మారింది. అయితే, ఈ ప్లాన్‌ను బీఎస్ఎన్ఎల్ కొత్త ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా రూపొందించింది. ఇది ప్రమోషనల్ లిమిటెడ్ పీరియడ్ ఆఫర్‌గా తీసుకవచ్చింది బీఎస్ఎన్ఎల్. ఆగస్టు 1 నుంచి ఆగస్టు 31 వరకు మాత్రమే ఇది అందుబాటులో ఉంటుంది. ఈ గడువులోపు కొత్త యూజర్లకు ఇది వరంగా నిలుస్తుంది.

ఈ ప్లాన్ ఎవరికి లభిస్తుంది?
బీఎస్ఎన్ఎల్ “ఆజాదీ కా ప్లాన్” కేవలం కొత్త వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. అంటే కొత్తగా బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్‌కు చేరే వారు ఈ ఆఫర్‌ను పొందవచ్చు. ఇది మిగిలిన యాక్టివ్ లేదా ఎగ్జిస్టింగ్ యూజర్లకు వర్తించదు.

Vivo X200 FE vs Oppo Reno 14 Pro: ఫ్లాగ్‌షిప్ ఫోన్ కొనాలనుకుంటున్నారా? వివో, ఒప్పోలో ఏది బెస్ట్!

రూ.1 ప్లాన్‌తో ఏమేం లభిస్తాయి?
ఈ ఆఫర్ ద్వారా వినియోగదారులు కేవలం రూ.1 చెల్లించి 30 రోజుల పాటు ప్రయోజనాలను పొందవచ్చు, ఇందులో భాగంగా అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్ (లొకల్, నేషనల్), రోజుకు 2GB హై-స్పీడ్ డేటా, ప్రతి రోజు 100 SMSలు ఉచితం లభిస్తాయి. ఈ ప్రయోజనాలు అన్ని కూడా బీఎస్ఎన్ఎల్ 3G, 4G నెట్‌వర్క్‌లపై లభిస్తాయి.

ప్రస్తుతం ప్రైవేట్ టెలికాం కంపెనీలు రీఛార్జ్ రేట్లు పెంచుతున్నాయి. అయితే, ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్ మాత్రం ప్రజలకు తక్కువ ధరకు ఎక్కువ విలువ గల సేవలు అందించేందుకు కృషి చేస్తోంది. ఈ “ఆజాదీ కా ప్లాన్” ద్వారా ప్రభుత్వ సంస్థగా తన బాధ్యతను చక్కగా నిర్వర్తిస్తోందని చెప్పవచ్చు. మొత్తంగా మీరు కొత్తగా బీఎస్ఎన్ఎల్ సేవలు ప్రారంభించాలనుకుంటున్న యూజర్ అయితే, ఈ రూ.1 ప్లాన్‌ను తప్పకుండా ట్రై చేయండి. తక్కువ ధరలో అధిక ప్రయోజనాలు పొందే ఇదొక అద్భుత అవకాశం. భారతీయులు ఒకవైపు స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటూ… బీఎస్ఎన్ఎల్ నుండి వచ్చిన ‘డిజిటల్ స్వాతంత్య్రాన్ని’ ఎంజాయ్ చేయండి.

Raja Singh Encounter: ఎమ్మెల్యే రాజాసింగ్ ఎన్‌కౌంటర్‌కి భారీ స్కెచ్..!

Exit mobile version