Bsnl: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) గ్రామీణ ప్రాంతాల వినియోగదారుల కోసం తక్కువ ధరలో ఆకర్షణీయమైన బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను అందిస్తోంది. కేవలం రూ.1,449తో ఏకంగా 6 నెలల వ్యాలిడిటీ కలిగిన ఈ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. తక్కువ ధరలో ఇంటర్నెట్ సేవలు అందించడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో బ్రాడ్‌బ్యాండ్ వినియోగాన్ని పెంచడమే ఈ ప్లాన్ ప్రధాన లక్ష్యం.
రూ.1,449 ప్లాన్:
BSNL Rural Entry Plan పేరుతో అందిస్తున్న ఈ ప్లాన్‌లో వినియోగదారులకు 6 నెలల వ్యాలిడిటీ లభిస్తుంది. ఇందులో 25 Mbps డౌన్‌లోడ్, అప్‌లోడ్ స్పీడ్ తో పాటు మొత్తం 700GB డేటా అందిస్తారు. 700GB డేటా పూర్తయిన తర్వాత కూడా ఇంటర్నెట్ సేవలు కొనసాగుతాయి. అయితే స్పీడ్ 2 Mbpsకు తగ్గుతుంది. దీంతో ప్రాథమిక ఇంటర్నెట్ అవసరాలను కొనసాగించవచ్చు.
అన్‌లిమిటెడ్ కాలింగ్:
ఈ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ సౌకర్యం కూడా ఉంది. అయితే ఇది ల్యాండ్‌లైన్ కాలింగ్ కు మాత్రమే వర్తిస్తుంది. ల్యాండ్‌లైన్ సేవలను ఉపయోగించాలంటే వినియోగదారులు ప్రత్యేకంగా ల్యాండ్‌లైన్ ఇన్‌స్ట్రుమెంట్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
OTT ప్రయోజనం కూడా:
తక్కువ ధరలోనే BSNL ఈ ప్లాన్‌తో ప్రసార్ భారతి (WAVES) ప్రీమియం OTT సబ్‌స్క్రిప్షన్ ను కూడా ఉచితంగా అందిస్తోంది. దీంతో వినియోగదారులు వినోద కార్యక్రమాలు, ఇతర డిజిటల్ కంటెంట్‌ను వీక్షించవచ్చు.
నెలవారీ ప్లాన్ కూడా..
ఈ Rural Entry Planను నెలవారీగా కూడా తీసుకోవచ్చు. ఇందుకోసం రూ.259 చెల్లించాలి. అయితే ఒకేసారి 6 నెలల ప్లాన్‌ను తీసుకుంటే నెలకు సగటున సుమారు రూ.241 మాత్రమే ఖర్చవుతుంది. అయితే ఈ ధరలకు వర్తించే పన్నులు (Taxes) అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.
గ్రామీణ కుటుంబాల్లో బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్లను పెంచేందుకు ఈ ప్లాన్‌ను రూపొందించినట్లు BSNL తెలిపింది. తక్కువ ధరలో ఇంటర్నెట్, ల్యాండ్‌లైన్ కాలింగ్, OTT సబ్‌స్క్రిప్షన్ వంటి ప్రయోజనాలు అందించడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లోని వినియోగదారులకు బాగా కలిసి రానుంది. తక్కువ బడ్జెట్‌లో ఇంటర్నెట్ కనెక్షన్ కావాలనుకునే వారు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నివసించే కుటుంబాలకుఇది బెస్ట్ ఆప్షన్.

