Site icon NTV Telugu

BRS: నేడు కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ఎల్పీ భేటీ..

Brslp

Brslp

ఈరోజు బీఆర్ఎస్ఎల్పీ భేటీ కానుంది. కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో ఎల్పీ సమావేశం జరగనుంది. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం పై చర్చించనున్నారు. అలాగే.. బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ అటెండ్ అవడంపై క్లారిటీ రానుంది. కాగా.. ఎల్పీ సమావేశానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. కాగా.. గత బడ్జెట్ సమావేశంలో డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సందర్భంలో ఒకరోజు మాత్రమే కేసీఆర్ హాజరయ్యారు. బడ్జెట్ తర్వాత మీడియా పాయింట్ వద్ద మాట్లాడి వెళ్లిపోయారు. ఆ తర్వాత రోజు నుంచి కేసీఆర్ అసెంబ్లీకి రాలేదు. దీంతో.. కాంగ్రెస్ నేతలు విమర్శలు సంధించారు. ఈ క్రమంలో.. ఈసారి జరగనున్న సమావేశాలకు కేసీఆర్ హాజరవుతారా లేదా అని తెలంగాణ రాజకీయాల్లో చర్చ జరుగుతోంది.

Read Also: SLBC: కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్.. సాయంత్రానికి రెండు డెడ్ బాడీస్..!

కాగా.. రేపు (బుధవారం) నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కానుంది. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభం కానుండగా.. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. ఈ సమావేశాలు ఈనెల 27 వరకు జరగనున్నాయి. అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి కేబినెట్‌లో చర్చ జరిగింది. అంతేకాకుండా.. ఉగాది నుంచి భూభారతి అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఫ్యూచర్ సిటీ కోసం కొత్త బోర్డు ఏర్పాటు చేశారు. నదీ జలాల అంశంపై ప్రత్యేక కమిటీ వేయాలని కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నారు. కొత్తగా 10,950 విలేజ్‌ లెవల్‌ ఆఫీసర్‌ పోస్టులు భర్తీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. కొత్త రెవెన్యూ డివిజన్లు, మండలాలకు 217 పోస్టులు మంజూరు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.

Read Also: Viral Video: జియోమెట్రీ బాక్స్‌తో అద్భుతం సృష్టించిన పిల్లలు

Exit mobile version