NTV Telugu Site icon

MLC Jeevan Reddy: బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి పడ్డాయి.. అందుకే కాంగ్రెస్కు..!

Jeevan

Jeevan

జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ పార్టీ రాజకీయ లబ్ధి కొరకు మత విద్వేషాలు రెచ్చగొట్టాలని ప్రయత్నించింది.. ముస్లింలను బూచిగా చూపి హిందూ ఓట్లలను మభ్యమెట్టి రాజకీయాలు చేశారు.. రెండు నెలల్లో అబ్కి బార్ చార్ సౌ పార్ ను మూడు వందల లోపు తీసుకు వచ్చామన్నారు. దేశంలో కాంగ్రెస్ ఎంపీల సంఖ్య పెంచుకున్నాం.. యూపీలో ఇండియా కూటమే అత్యధిక స్థానాలు గెలుచుకుంది.. హిందువులకే కాకుండా యావత్ ప్రపంచనికి శ్రీరాముడు ఆదర్శ మూర్తి.. రాముడిని రాజకీయాలకు వాడుకోవడం స్థానికులు జీర్ణించుకోలేక పోయారు అని ఆయన చెప్పుకొచ్చారు. ఆ దేవుడి దూతగా మోడీ ప్రచారం చేసుకోవడం నార్త్ ఇండియా జీర్ణించుకోలేదు.. నార్త్ ఇండియాలో మోడీ అంటే ఎవరో తెలిసిపోయింది.. ఇండియా కూటమి ఈ స్థాయికి రావడం రాహుల్ గాంధీ విజయమే అని జీవన్ రెడ్డి చెప్పుకొచ్చారు.

Read Also: Losabha Election Results: ఎన్నికల్లో చావు దెబ్బ తిన్న పార్టీ ఇప్పుడు మరింత..!

కాంగ్రెస్ పార్టీ సొంతంగా 99 సీట్లు సాధించడం సంతోషకరం అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తెలిపారు. అధిక రైతాంగం ఉండే పంజాబ్ లో ఆప్, కాంగ్రెస్ పోటి పడ్డాయి.. కానీ బీజేపీ పోటీలో ఉండలేక పోయింది.. వ్యవసాయంపై దేశం ఆధారపడి ఉంది, మినిమం సపోర్ట్ ప్రైజ్ అందేలా చూడాలని సూచించాలి.. ప్రభుత్వ వైఫల్యం ఎండగట్టే విధంగా రాహుల్ పని చేస్తారని ఆశిస్తున్నాం.. శత్రువు శత్రువు మిత్రుడులా ఉనికి కాపాడుకోవాల్సిన బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ఓటమి కోసం పని చేసి బీజేపీకి అండగా నిలిచారు.. త్రిముఖ పోరు కాస్త బీజేపీ, బీఆర్ఎస్ ఒకటి కావడం ద్విముఖ పోరుగా మారిపోయిందన్నారు. 2023 ఎన్నికలతో పోలిస్తే కాంగ్రెస్ ఓటు షేర్ పెరిగింది.. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ స్వగ్రామంలో కాంగ్రెస్ కు 40 శాతం ఓట్లు షేర్ చేసుకున్నాం.. జగిత్యాల నియోజకవర్గంలో ఓటింగ్ జరిగితే 40 వేల మెజార్టీ వచ్చేది అని జీవన్ రెడ్డి పేర్కొన్నారు.

Read Also: CM Revanth: బీజేపీ గెలిచిన 8 చోట్ల బీఆర్ఎస్ 7 చోట్ల డిపాజిట్ కోల్పోయింది..

ఇక, మాకు 10 శాతం ఓట్లు పెరిగినా బీఆర్ఎస్ ఓట్లు 16 శాతం బీజేపీకి పోల్ అయినట్లు వివరించారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.. జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గం, నిజామాబాద్ పార్లమెంట్ ప్రజలకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు.. ఎంపీ అరవింద్ కు చెందిన నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో కాంగ్రెస్ కు 16 వేల మెజార్టీ వచ్చింది.. రైతాంగం కోసం నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిచేలా కార్యరూపం దాల్చేందుకు, గల్ఫ్ బాధితులకు, బీడీ కార్మికుల సమస్యలు తీర్చే బాధ్యత తనపై ఉందన్నారు.. ప్రైవేట్ స్కూల్ ఫీజు నియంత్రణ చట్టం తీసుకువచ్చే అవసరం ఉంది.. మోడీ సర్కార్ ఎస్సీ, ఎస్టీ, బీసీలను కూడా EWSలో చేర్చాలనీ డిమాండ్ చేసింది.. ఈ అంశాన్ని రాహూల్ గాంధీ దృష్టికి తీసుకు వెళ్తామని జీవన్ రెడ్డి తెలిపారు.