BRS: కవిత కొత్త పార్టీపై బీఆర్ఎస్ సెటైర్.. డూప్లికేట్ కోల్గేట్, బిస్లెరీ ఫొటోలతో ట్వీట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BRS Satire on Kavitha New TRS Party: కవిత పార్టీపై బీఆర్ఎస్ వ్యంగ్యంగా స్పందించింది. కవిత తన కొత్త పార్టీ పేరును టీఆర్ఎస్ (తెలంగాణ రాష్ట్ర సేన)గా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై స్పందించిన బీఆర్ఎస్.. ఎంతైనా ఒరిజినల్ ఒరిజినలే అని సెటైర్ వేసింది. కవిత పార్టీ పేరును కాపీ కొట్టిందని అర్థం వచ్చేలా ట్వీట్ చేసింది. సెటైర్‌గా ఒరిజినల్, డూప్లికేట్ కోల్గేట్, బిస్లెరీ ఫొటోలు షేర్ చేసింది బీఆర్ఎస్. ఒరిజినల్ ఎప్పటికీ ఒరిజినలే అంటూ బీఆర్ఎస్ పోస్ట్ చేసింది.
ఇక, కేసీఆర్ మారిన మనిషి.. మన మనిషి కాదు.. మర మనిషి అని కవిత సంచలన వ్యాఖ్యలు చేసింది. ఏ కష్టమొచ్చినా ఆ సారు రారు, ఎందుకంటే ఆయన మారిన మనిషి.. ఆయన గుంటనక్కల చేతిలో ఇరుక్కున్న మనిషి, మన మనిషి కాదన్నారు. “మన కేసీఆర్ అయ్యింటే పాలమూరు ప్రాజెక్టును కట్టించేవారు.. మారిన కేసీఆర్ పంజాబ్ వెళ్లారు.. జాతీయ పార్టీ పెడతానని చెప్పారు.. సింగరేణిలో గనిలో కార్మికుడు చనిపోతే చూసొచ్చే వ్యక్తి.. కేసీఆర్ రాజకీయ పరిణితి కోల్పోయారు.. కేటీఆర్ మాట్లాడారంటే అనుకోవచ్చు.. ఆయనకు రాజకీయం తెలియదు.. ఒక కర్కోటకుడి పాలన నడుస్తోంది.. ఇళ్లను కూల్చుతుంటే ఆదుకోవాల్సిన అమ్మలాంటి కేసీఆర్ ఎక్కడున్నారు..? మారుతారేమోనని చూశా.. కానీ, నన్నే సస్పెండ్ చేశారు. ఉద్యమకారులను పార్టీ నుంచి బయటకు పంపిన రోజే నేను మాట్లాడాల్సింది.. కానీ, మాట్లాడలేదు.. ఇవాళ నాకు అదే జరిగింది.. ఉద్యమంలో కొట్టినవారినే తీసుకొచ్చి పట్టం కట్టారు.. వాళ్ల అనుచరులు మనవాళ్లను అణగతొక్కారు.. ఉద్యమకారులను నామినేటెడ్ పోస్టులు ఇచ్చినా సరిపోయేది.. కండువా వేసుకొని అప్పుడు పిచ్చొల్లలాగా తిరిగాం.. ఆ పార్టీలో అమ్మతనం పోయింది, మమకారం పోయింది.. అందుకే కేసీఆర్ మన కేసీఆర్ కాదు.. మరబొమ్మ అయ్యారు.” అని కవిత వ్యాఖ్యానించారు.
Also Read
- UP Election 2027: ‘‘150 కాదు.. కాంగ్రెస్‌కు 50 సీట్లే ఎక్కువ’’.. ఎస్పీ-కాంగ్రెస్ మధ్య ముదురుతున్న విభేదాలు!
- AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
- Nara Lokesh: ఏపీలో 50 శాతం మంది ఎమ్మెల్యేలు యువత.. పరిశ్రమలకు కొత్త అర్థం చెప్పడమే మా లక్ష్యం..
- India vs Pakistan: పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్.. టీమిండియా ఖాతాలో మరో స్వర్ణం..
ఒరిజినల్ ఎప్పటికీ ఒరిజినలే! pic.twitter.com/YBlx20tlRf
— BRS Party (@BRSparty) April 25, 2026
తాజావార్తలు
-
UP Election 2027: ‘‘150 కాదు.. కాంగ్రెస్‌కు 50 సీట్లే ఎక్కువ’’.. ఎస్పీ-కాంగ్రెస్ మధ్య ముదురుతున్న విభేదాలు!
-
Young Heroines : తల్లయితే తప్పేంటి?
-
Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
-
Venu Swamy : “నేను సన్నీ లియోన్ లాంటోడిని.. ఆల్రెడీ అన్నీ ఇప్పేసుకున్నా!”!
-
AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!