Site icon NTV Telugu

Palla Rajeshwar Reddy: జారిపడ్డ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి.. హాస్పిటల్‌కి తరలింపు..!

Palla Rajeshwar Reddy

Palla Rajeshwar Reddy

Palla Rajeshwar Reddy:బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ ఎర్రవల్లిలోని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసంలో జారిపడి తుంటి ఎముకకు గాయమైనట్లు సమాచారం. ఘటన జరిగిన వెంటనే ఆయన్ని చికిత్స నిమిత్తం హైదరాబాద్‌ లోని యశోద ఆసుపత్రికి తరలించారు. నేడు (జూన్ 11) మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరుకానుండగా, ఆయన్ను కలవడానికి పలువురు బీఆర్ఎస్ నేతలు ఎర్రవల్లి ఫామ్ హౌస్‌కు చేరుకున్నారు. ఈ క్రమంలోనే పల్లా రాజేశ్వర్ రెడ్డి అక్కడ జారిపడినట్లు సమాచారం.

Read Also: KCR Enquiry: విచారణకు హాజరుకానున్న మాజీ సీఎం.. బీఆర్‌కే భవనం వద్ద భారీగా పోలీసు బందోబస్తు..!

తుంటి ఎముకకు గాయం అయినందున వైద్యులు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం యశోద ఆసుపత్రిలో వైద్య బృందం పర్యవేక్షణలో ఆయనకు చికిత్స కొనసాగుతోంది. ఈ ఘటన కేసీఆర్ విచారణ నేపథ్యంలో మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఎమ్మెల్యే పల్లా త్వరగా కోలుకోవాలని పలువురు నేతలు ఆకాంక్షిస్తున్నారు.

Read Also: Road Accidents: తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదాలు.. ఐదుగురు మృతి, ఇద్దరు గాయాలు..!

Exit mobile version