BRS Mla Lasya Nandita Passed Away: రోడ్డు ప్రమాదంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మరణ వార్త విని షాక్ కు గురి చేసింది అని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తండ్రి సాయన్న చనిపోయిన ఏడాదిలోపే ఆమె మృతి చెందడం దురదృష్టకరం అని పేర్కొన్నారు. ఆమె ముందు ఉజ్వల భవిష్యత్తు ఉండగా.. విధి మరొకటి తలచింది అన్నారు. లాస్య నందిత కుటుంబ సభ్యులకు నా సానుభూతి తెలియజేస్తున్నాను అని ఆయన తెలిపారు.
Read Also: Weight Loss : అధిక బరువుకు చెక్ పెట్టాలంటే.. ఈ అలవాట్లకు దూరంగా ఉండాలి..
అయితే, సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత ఇవాళ తెల్లవారుజామున పటాన్ చెరు దగ్గరలోని ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో సంఘటన ప్రదేశంలోనే మృతి చెందారు. లాస్య నందిత మృతిపై ఇప్పటికే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి.. అలాగే, మాజీ మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, మాల్లారెడ్డి లు సంతాపం వ్యక్తం చేశారు.