Site icon NTV Telugu

Telangana Elections 2023: జై కేసీఆర్-జై కాలేరు నినాధాలతో దద్దరిల్లిన కాచిగూడ!

Kaleru Venkatesh

Kaleru Venkatesh

Amberpet MLA Kaleru Venkatesh’s election campaign in Amberpet: తెలంగాణ రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు నవంబర్ 30వ తేదీన ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఎన్నికలకు ఇంకా నెల రోజుల సమంయం మాత్రమే ఉండడంతో.. అన్ని పార్టీలు ప్రచారంలో జోరు పెంచాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో (2014, 2018) విక్టరీ కొట్టిన బీఆర్ఎస్.. హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా దూసుకుపోతుంది. ఇప్పటికే సీఎం కేసీఆర్ వరుస బహిరంగ సభలతో ప్రచారం చేస్తున్నారు. మరోవైపు ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా ప్రచారం ఆరంభించారు. బీఆర్ఎస్‌ అభ్యర్థి, అంబర్‌పేట్‌ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ తన ప్రచార పాదయాత్రలో జోరు పెంచారు.

అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్.. కాచిగూడ డివిజన్ నింబొలి అడ్డాలోని మహంకాళి ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే తన ఎన్నికల ప్రచార పాదయాత్రను ప్రారంభించారు. నింబోలి అడ్డాలో మొదలైన ప్రచార పాదయాత్ర మౌలానా ఆజాద్ నగర్, సూరజ్ నగర్ వరకు ఘనంగా సాగింది. జై కేసీఆర్ –జై కాలేరు నినాదాల మధ్య ఈ కార్యక్రమం ఒక పండుగ వాతావరణంలా కొనసాగింది.

Also Read: Dhoni: ధోనీ పేరు చెప్పి పాపను కిడ్నాప్ చేసిన నిందితులు.. మూడు రోజులైన దొరకని ఆచూకీ

ప్రతిచోట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ గారికి మహిళలు ఘన స్వాగతం పలికారు. గతంలో ఎన్నడూ చూడని విధంగా తమకు రోడ్లు, డ్రైనేజీలు, త్రాగు నీరు ఏర్పాటు చేశారని.. సంక్షేమ పథకాలు అందించారని పేర్కొంటూ సీఎం కేసీఆర్ మరియు ఎమ్మెల్యే కాలేరుకి ధన్యవాదాలు తెలిపారు. ‘మా ఓటు మీకే-మళ్లీ మీరే మా ఎమ్మెల్యే’ అంటూ కాలేరు వెంకటేష్ గారికి జనాలు నీరాజనాలు పట్టారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Exit mobile version