NTV Telugu Site icon

CM KCR: గోదావరి పరివాహక ఎమ్మెల్యేలతో సీఎం కేసీఆర్ భేటీ

Kcr

Kcr

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నేడు గోదావరి నది పరివాహక ప్రాంత భారతీయ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు. గతేడాది గోదావరి పరివాహక ప్రాంతాలలో భారీ వర్షాలు కురిసి పలు ప్రాంతాలు ముంపునకు గురైయ్యాయి. అయితే ఈ ఏడాది కూడా ఆశించిన స్థాయిలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. జూలై, ఆగస్టు నెలలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Read Also: Money Saving Scheme : రిస్క్ లేకుండా రూ.100 పొదుపుతో రూ.55 లక్షలు పొందండి..

గడిచిన రెండు సంవత్సరాలుగా రాష్ట్రంలో పుష్కలంగా వానలు కురిశాయి. దీంతో సాగు, తాగునీటి అవసరాలకు ఎలాంటి కొదవ లేకుండా పోయింది అని తెలంగాణ సర్కార్ వెల్లడించింది. అలాగే గోదావరి పరివాహక ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. అయితే ఈ ఏడాది కూడా వర్షాలు జోరుగా కురుస్తాయని వాతావరణ శాఖ సూచిస్తున్న నేపథ్యంలో ఎటువంటి చర్యలు చేపట్టాలో ఎమ్మెల్యేలకు ఈ మీటింగ్ లో సీఎం కేసీఆర్ సూచనలు చేసే ఛాన్స్ ఉంది. కాగా తెలంగాణలో శనివారం నుంచి మళ్లీ వర్షాలు ప్రారంభమైనాయి. ఇటు హైదరాబాద్ మహానగరంలో ఏకంగా ఐదు రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.

Read Also: World Cup : ప్రపంచ కప్ పిచ్‌పై ఆర్థిక వ్యవస్థ ఫోర్లు, సిక్స్‌లు.. ఈ రంగాలకు బూస్ట్

సచివాలయంలో మధ్యాహ్నం 2 గంటలకు వారితో సీఎం కేసీఆర్ భేటీ కానున్నారు. తాజా రాజకీయ పరిస్థితులపై మంత్రులు, ఎమ్మెల్యేలతో సీఎం కేసీఆర్ సమీక్ష చేయనున్నారు. ఈ సమావేశంలో మంత్రులకు, ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్ ఎలాంటి సూచనలు, సలహాలు ఇవ్వనున్నారు అనేదానిపై సర్వాత్ర ఆసక్తి నెలకొంది.