Site icon NTV Telugu

Hyderabad: హైదరాబాద్ పాతబస్తీలో దారుణం.. అక్క, అన్న పై దాడి చేసిన తమ్ముడు.. అక్క మృతి

Hyderabad

Hyderabad

క్షణికావేశంలో దారుణాలకు ఒడిగడుతున్నారు. ఆస్తుల కోసం కన్నతల్లిదండ్రులు, తోబుట్టువులుపై కూడా దాడులకు పాల్పడుతున్నారు. ఇటీవలి కాలంలో ఇలాంటి ఘటనలు ఎక్కువైపోతున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. హైదరాబాద్ పాతబస్తీ చాదర్ ఘాట్ లో దారుణం వెలుగుచూసింది. అక్క, అన్న పై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు ఓ తమ్ముడు. ఈ దాడిలో సోదరుడికి తీవ్ర గాయాలు కాగా అక్క ప్రాణాలు కోల్పోయింది. లక్ష్మిని ఆమె సోదరుడు మదన్‌ బాబు కత్తితో దాడిచేసి చంపేశాడు. గాయపడిన సోదరుడిని ఆస్పత్రికి తరలించారు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఈ దారుణానికి పాల్పడ్డట్టు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Exit mobile version