పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మరియు మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన చిత్రం బ్రో.. ది అవతార్. సోషియో ఫాంటసీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో లో కేతికా శర్మ మరియు ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్లుగా నటించారు.అలాగే బాలీవుడ్ నటి ఊర్వశి రౌతెలా ఓ స్పెషల్ సాంగ్‌లో సందడి చేసింది. భారీ అంచనాలతో జులై 28న థియేటరర్లలో విడుదలైన బ్రో సినిమా మంచి విజయం సాధించింది.. మొదటి మూడు రోజుల్లోనే వంద కోట్ల క్లబ్‌లో చేరింది. ఈ సినిమాలో మొదటిసారి మామా అల్లుళ్లు కలిసి నటించడం అలాగే పవన్ వింటేజ్ లుక్స్ మరియు సాంగ్స్ కు ఫ్యాన్స్ నుంచి భారీ రెస్పాన్స్ రావడంతో ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టారు.. దీంతో బాక్సాఫీస్ వద్ద బ్రో మంచి వసూళ్లు సాధించింది. ఆ తర్వాత ఆగస్టు 25 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్ ఫ్లిక్స్‌లో కూడా బ్రో సినిమా సందడి మొదలైంది. ఇక్కడ కూడా బ్రో మూవీకి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్ వంటి దేశాల్లో కొన్ని రోజుల పాటు బ్రో టాప్ ట్రెండ్‌లో నిలవడం విశేషం.
ఇలా థియేటర్లు, ఓటీటీల్లో సందడి చేసిన బ్రో ఇప్పుడు టీవీలోకి రాబోతుంది.. అక్టోబర్ 15న జీ తెలుగు ఛానెల్‌లో సాయంత్రం 6 గంటలకు బ్రో మూవీ ప్రసారం కానుంది. తాజాగా దీనికి సంబంధించిన వీడియోను జీ తెలుగు ఛానెల్ సోషల్ మీడియాలో షేర్ చేసింది.ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు జీ తెలుగు ఓ స్వీట్ సర్‌ప్రైజ్ ను ఇచ్చింది. హైదరాబాద్‍లోని నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా వద్ద పవన్ కల్యాణ్ 54 అడుగుల భారీ కటౌట్‍ను ఏర్పాటుచేసింది. అంతేకాదు ఈ భారీ కటౌట్‍కు ఓ కౌంట్‍డౌన్ టైమర్‌ను కూడా సెట్ చేయడం జరిగింది.. జీ తెలుగు ఛానెల్‌లో బ్రో ప్రసారానికి ఇంకా ఎంత సమయం ఉందో ఈ టైమర్ చూపిస్తోంది. ప్రస్తుతం పవన్ కటౌట్ ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఆ కటౌట్ వద్ద అభిమానులు ఫొటోలు, సెల్ఫీలు దిగేందుకు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. . పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ బ్రో మూవీ ని నిర్మించారు. తమిళ్ హిట్ మూవీ వినోదయ సిత్తంను తెలుగు ప్రేక్షకులకు అనుగుణంగా రూపొందించారు.డైరెక్టర్ సముద్రఖని. రోహిణీ, బ్రహ్మానందం, సుబ్బరాజు, వెన్నెల కిశోర్, అలీ రెజా, తనికెళ్ల భరణి, పృథ్వీరాజ్, శ్రీనివాస రెడ్డి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. మరి థియేటర్లలోఅలాగే ఓటీటీలో మంచి రెస్పాన్స్ సొంతం చేసుకున్న బ్రో మూవీ బుల్లితెరపై ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి.
