NTV Telugu Site icon

Bro 1st Day Collections: దుమ్మురేపే కలెక్షన్స్ తో దూసుకుపోతున్న బ్రో..

Whatsapp Image 2023 07 29 At 4.14.50 Pm

Whatsapp Image 2023 07 29 At 4.14.50 Pm

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కలసి నటించిన లేటెస్ట్ మూవీ బ్రో..ఈ సినిమా ఈ శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గ్రాండ్ గా విడుదల అయింది.. ఈ చిత్రం తమిళ సూపర్ హిట్ మూవీ వినోదయ సీతం రీమేక్ గా తెరకెక్కింది.ఈ చిత్రంలో ప్రియా ప్రకాష్ వారియర్, కేతిక శర్మ హీరోయిన్ లుగా నటించారు.ఈ చిత్రానికి సముద్రఖని దర్శకత్వం వహించగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే మరియు డైలాగ్స్ అందించారు.ఈ సినిమాకి అనుకున్న స్థాయిలో బజ్ క్రియేట్ అవ్వకపోవడంతో మొదటి రోజు క్రిటిక్స్ మరియు ప్రేక్షకుల నుంచి ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది.అయిన కూడా బాక్సాఫీస్ వద్ద పవర్ స్టార్ తన స్టామినా ఏంటో నిరూపించాడు.బ్రో మూవీ తొలి రోజు పవన్ కళ్యాణ్ గత కమర్షియల్ చిత్రాలకు ధీటుగా వసూళ్లు రాబట్టి అందరినీ ఆశ్చర్య పరిచింది..

ప్రపంచ వ్యాప్తంగా బ్రో సినిమా మొదటి రోజు ఏకంగా 48 కోట్ల గ్రాస్ కొల్లగొట్టింది.అలాగే ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ 30 కోట్లకు పైగా షేర్ ను సాధించింది.తెలుగు రాష్ట్రాల్లోకూడా బ్రో మూవీ దుమ్ము రేపే కలెక్షన్స్ అదరగొట్టింది.అక్కడ బ్రో చిత్రం ఫస్ట్ డే 23.5 కోట్ల షేర్ ను సాధించింది.. పవన్ కళ్యాణ్ గత చిత్రం అయిన భీమ్లా నాయక్ తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజు 26 కోట్ల షేర్ సాధించిన విషయం తెలిసిందే. అయితే భీమ్లా నాయక్ స్థాయిలో బ్రోపై అంచనాలు లేకపోయినా కూడా ఈ స్థాయి కలెక్షన్స్ నమోదు అయ్యాయి అంటే మామూలు విషయం కాదు. బ్రో సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 98 కోట్లకు పై గా ప్రీరిలీజ్ బిజినెస్ జరిగింది. మొదటి రోజే ఈ సినిమా దాదాపు 30 శాతం రికవర్ చేసినట్లు సమాచారం.బ్రో చిత్రంపై మిక్స్డ్ టాక్ వస్తున్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కావాల్సిన మాస్ మూమెంట్స్ అన్నీ ఉండటంతో సినిమాను పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతగానో ఎంజాయ్ చేస్తున్నారు.

Show comments