NTV Telugu Site icon

Rishi Sunak: బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్, ఆయన భార్య ఆస్తులు పెరిగాయ్..

British Prime Minister

British Prime Minister

రిషి సునాక్ పేరు అందరికీ సుపరిచితమే. భారత సంతతికి చెందిన అతడు బ్రిటన్ ప్రధానిగా కొనసాగుతున్నారు. తాజాగా అతడు మరోసారి వార్తల్లోకెక్కారు. బ్రిటన్‌ ప్రధానమంత్రి రిషి సునాక్, ఆయన భార్య అక్షతా మూర్తి మరింత సంపన్నులు అయ్యారు. రెండేళ్ల క్రితం సండే టైమ్స్‌ సంపన్నుల జాబితాలో చోటు దక్కించుకున్న వీరు, శుక్రవారం విడుదలైన జాబితాలో తమ ర్యాంకును మరింత మెరుగు పరచుకుని అత్యంత సంపన్నులైన బ్రిటన్‌ ప్రధానమంత్రి దంపతులుగా నిలిచారు.

READ MORE: Uttarpradesh : ప్రభుత్వం పై నమ్మకం లేదు.. 24గంటలూ ఈవీఎంలకు కాపలాగా నాయకులు

అయితే.. ఇన్ఫోసిస్‌ కంపెనీలో అక్షతా మూర్తికి షేర్లు ఉన్నాయి. అవే వీరింత సంపన్నులు కావడానికి కారణం. సండే టైమ్స్‌ సంపన్నుల జాబితాలో ఈ దంపతులు గతేడాది 275వ స్థానంలో నిలిచిన విషయం విదితమే. తాజాగా ఈ ఏడాది సుమారు రూ.6,873 కోట్ల (651 మిలియన్‌ పౌండ్లు) సంపదతో ర్యాంకును మెరుగు పరచుకుని 245వ స్థానానికి చేరుకున్నారు. 2022-23లో రిషి సునాక్‌ సుమారు రూ.23 కోట్లు (2.2 మిలియన్‌ పౌండ్లు) సంసాదించగా, ఆయన సతీమణి అక్షతామూర్తి డివెండెండ్ల రూపంలో ఏకంగా రూ.137 కోట్లు (13 మిలియన్‌ పౌండ్లు) కూడగట్టుకున్నారు. వీరి ఆస్తిలో సింహభాగం అక్షతామూర్తికి ఇన్ఫోసిస్‌లో ఉన్న షేర్లే కావడం విశేషం. భారత సంతతికి చెందిన వ్యక్తి బ్రిటన్ లో సంపన్నుల జాబితాలో చోటు సాధించడంపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.

2022లో బిలియనీర్ల గరిష్ఠ సంఖ్య 177 కాగా.. ఈ ఏడాది 165కి పడిపోయింది. ఈ క్షీణతకు కారణం కొంతమంది బిలియనీర్లు అధిక రుణ రేట్లు కారణంగా వారి సంపద మంచులా కరిగిపోగా.. మరికొందరు దేశం విడిచిపెట్టారని బ్రిస్టల్ లైవ్ నివేదించింది . బ్రిటన్‌లోని 350 మంది కుబేరులు ఉండగా.. ఆ కుటుంబాల మొత్తం సంపద 795.36 బిలియన్లుగా ఉందని తాజా గణాంకాలు చూపిస్తున్నాయి. ఈ సంవత్సరం యూకే బిలియనీర్ల జాబితాలో హిందుజా గ్రూప్‌ అధినేత గోపీచంద్ హిందూజా, అతని కుటుంబం నిలిచింది. హిందూజా కుటుంబం సంపద ఈ ఏడాది 35 బిలియన్‌ యూరోల నుండి 37.2 బిలియన్‌ యూరోలకు పెరిగింది.

Show comments