Site icon NTV Telugu

RK Beach: ఆశ్చర్యానికి గురిచేసిన ఆర్కే బీచ్.. వెలుగులోకి బ్రిటీష్ కాలంనాటి బంకర్!

RK Beach

RK Beach

విశాఖ ఆర్కే బీచ్ (రామకృష్ణ బీచ్‌) సందర్శకులను ఆశ్చర్యానికి గురి చేసింది. భారీ అలలతో ఎగిసిపడే సముద్రం బాగా వెనక్కి వెళ్లింది. దీంతో నీలి సముద్రంపు కెరటాల మధ్య చిక్కుకుపోయిన శిలలు బయటపడ్డాయి. బ్రిటీష్ కాలం నాటిదిగా భావించే బంకర్ సైతం వెలుగులోకి వచ్చింది. అలలు తగ్గడంతో భారీ రాళ్లు ఎక్కి సందర్శకులు సందడి చేశారు. సెల్ఫీలు, రీల్స్ చేస్తూ హడావిడిగా కనిపించారు.

Also Read: Pawan Kalyan: 75 ఏళ్ల తర్వాత విద్యుత్ కనెక్షన్.. పవన్ కళ్యాణ్ చిత్రపటానికి గిరిపుత్రుల పాలాభిషేకం!

ఇటీవల వరుసగా అలప్పీడనలు, తుఫాన్ కారణంగా విశాఖ తీరం అంతా గంభీరంగా ఉంది. కార్తీక పౌర్ణమి కావడం, ఆటుపోట్లు మార్పులతో ఒక్కసారిగా ప్రశాంతంగా కనిపించింది. వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నప్పుడు సముద్రం ముందుకు రావడం, వెనక్కు వెళ్లడం సాధారణమే అంటున్నారు ఎక్స్పర్ట్స్. ఇక ఆర్కే బీచ్ రోడ్‌లో కొత్త అద్దాల మేడ సందర్శకుల కోసం ప్రారంభమైన విషయం తెలిసిందే. మాయా వరల్డ్ పేరుతో నిర్మించిన ఈ అద్దాల అద్భుతాన్ని సందర్శకులు ఎంజాయ్ చేస్తున్నారు.

Exit mobile version