NTV Telugu Site icon

Brinjal Cultivation: వంగసాగులో కాయతొలచు పురుగు నివారణ చర్యలు..

Brinjal

Brinjal

మనం పండించే కూరగాయాలలో ఎక్కువగా వంకాయలు కూడా ఉన్నాయి.. వీటికి మార్కెట్ లో ఎక్కువగా డిమాండ్ ఉంటుంది.. అందుకే వీటిని పండించడానికి రైతులు కూడా ఆసక్తిని చూపిస్తున్నారు.. వంగలో తెగుళ్లు, పురుగుల బెడద కూడా ఎక్కువగానే ఉంటుంది.. వీటిని ఎప్పటికప్పుడు గుర్తించి తగు చర్యలు తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.. అప్పుడే మంచి దిగుబడిని పొందుతారు..

మొవ్వకాయ తొలుచు పురుగు పంటకు తీవ్రనష్టాన్ని కలుగ జేస్తుంది. మొక్కలు పెరిగే వయస్సులో మొవ్వును, తర్వాత దశలో కాయలను తొలచి వేస్తుంది.. కొన్ని సార్లు కాయలు వంకర కూడా తిరిగి ఉంటాయి. వంకాయ మొక్కల మొవ్వు భాగం వాలిపోయి కాయలపై రంధ్రాల్లో పిల్ల పురుగులు విసర్జించడాన్ని గమనించి ఈ పురుగు ఉనికిని గుర్తించవచ్చు.. ఈ ఒక్క పురుగు దాదాపుగా ఆరు కాయలను పాడు చేస్తుంది…

ముందుగా నారును రైనాక్సిపైర్ 18.5ఎస్.సి 5మి.లీ లీటరు నీటిలో మూడు గంటలు ముంచి తరువాత నాటుకోవాలి. ఈ పురుగు ఆశించిన మొదటి దశలోనే కొమ్మలను తుంచి కాల్చివేయాలి. లింగాకర్షక బుట్టలను ప్రధాన పొలంలో 100 ఎరలు లేదా హెక్టారుకు 10మీ ఎడంలో వెదురు కట్టెలకు అమర్చితే తల్లి పురుగులు ఎరకు ఆకర్షించబడి బుట్టలో పడిచనిపోతాయి.. ఇక ఆకుల అడుగు భాగంలో ట్రైకోకార్డులను అమర్చాలి.. వేపనూనె 5మి.లీ, లేదా బీటీ సంబంధిత మందులు 500గ్రా హెక్టారుకు పిచికారి చేయాలి.ఈ పురుగు నివారించుకోవటానికి క్లోరాంట్రానలిప్రోల్ 18.5 ఎస్.సి 0.4మి.లీ లేదా ఎమామెక్టిమ్ బెంజోయేట్ 5 ఇ.జి. 0.4గ్రా. లేదా ల్యాండా సైహలోత్రిన్ 5 ఇ.సి 0.6మి.లీ, లేదా థయోడికార్బ్ 75డబ్ల్యు.పి ఒక లీటర్ నీటికి కలిపి అమర్చితే పురుగులు బెడదా అనేది అసలు ఉండదు.. దీనిపై ఇంకేమైనా సందేహం ఉంటే వ్యవసాయ నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది..