NTV Telugu Site icon

Bride Kidnap: కంట్లో కారం కొట్టి.. పెళ్లి కూతురును కిడ్నాప్ యత్నం.. వీడియో వైరల్..

Bride

Bride

తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. అచ్చం సినిమా ఫక్కీలో జరిగిన ఈ డ్రామాకు సంబంధించి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పెళ్లిమండపంలోని పెళ్లికూతురును కిడ్నాప్ కు సంబంధించి వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక అసలు విషయం చూస్తే..

Also Read: Peddireddy Ramachandra Reddy: నల్లారి బ్రదర్స్‌ని టార్గెట్‌ చేసిన మంత్రి పెద్దిరెడ్డి..

రాజమండ్రి రూరల్ కడియంలో సినీ ఫక్కీలో ఈ సంఘటన చోటుచేసుకుంది. రాజమండ్రి రూరల్ కడియంలో పచ్చని పెళ్లి పందిరిలో పెళ్ళి కార్యక్రమమం జరుగుతుండగా కొందరు దుండగులు కంట్లో కారం కొట్టి పెళ్లి కూతురును కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారు.

Also Read:Piyush Goyal: తెలంగాణలో బీజేపీ క్లీన్‌స్వీప్‌ చేస్తుంది.. రాహుల్‌ ఎప్పటికీ ప్రధాని కాలేరు..

మొదట పెళ్లి పీటల మీద నుంచి పెళ్లి కూతురును కిందకి లాగారు. ఆ తర్వాత ఆమె చేతిని పట్టుకుని బలవంతంగా లాక్కెళ్లారు. కానీ పెళ్లి కూతురు బంధువులు ఆమెను ఆ దుండగుల నుంచి కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. ఆపై ఏం జరిగిందనే వివరాలు తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా ఏకంగా పెళ్ళిపీటల మీద నుండి అలా ఆ అమ్మాయిని తీసుకెళ్లడం నిజంగా అమానుష సంఘటనే.

Show comments