NTV Telugu Site icon

Brian Lara-Sachin: అతడి టాలెంట్‌కు.. సచిన్, నేను దరిదాపుల్లో కూడా లేము: లారా

Sachin Tendulkar Lara

Sachin Tendulkar Lara

Brian Lara Heap Praise on Carl Hooper: సహజసిద్ధమైన ప్రతిభపరంగా చూస్తే తాను, సచిన్ టెండూల్కర్ టాలెంటెడ్ ప్లేయర్లం కాదని వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారా అన్నాడు. వెస్టిండీస్‌ మాజీ ఆల్‌రౌండర్ కార్ల్ హూపర్ తాను చూసిన అత్యుత్తమ ఆటగాడు అని పేర్కొన్నాడు. క్లార్‌కు ఉన్న టాలెంట్‌కు సచిన్, తాను దరిదాపుల్లో లేమని చెప్పాడు. క్రికెట్‌లో ఆల్ టైమ్ అత్యుత్తమ బ్యాటర్‌లలో సచిన్, లారాలు ముందుంటారు. వీరిద్దరూ నెలకొల్పిన ఎన్నో రికార్డులు కొన్ని ఇప్పటికీ చెక్కు చెదరలేదు.

తాజాగా బ్రియాన్ లారా మాట్లాడుతూ.. ‘నేను చూసిన అత్యుత్తమ ఆటగాళ్లలో కార్ల్ హూపర్‌ ఒకరు. సచిన్‌ టెండూల్కర్‌తో పాటు నేను కూడా క్లార్‌కు ఉన్న టాలెంట్‌కు దరిదాపుల్లో లేము. కెరీర్ ఆరంభం నుంచి కెప్టెన్‌ అయ్యేవరకు హూపర్‌ గణాంకాలు భిన్నంగా ఉన్నాయి. కెప్టెన్‌గా దాదాపు 50 సగటుతో ఆడాడు. కానీ తన సామర్థ్యాలను ఆటగాడిగా కాకుండా.. కెప్టెన్‌గా మాత్రమే వినియోగించుకోవడం బాధాకరం’ అని అన్నాడు. వెస్టిండీస్ దిగ్గజం వీవీయన్ రిచర్డ్స్‌కు హూపర్‌పై ప్రత్యేక అభిమానం ఉంటుందని తెలిపాడు. వివ్‌ రిచర్డ్స్ ఎప్పుడూ ఒక వ్యక్తి ఎదుగుదలను చూసి అసూయపడలేదని, ఇతరులు తనకంటే బాగా ఆడకూడదని ఎప్పుడూ కోరుకోలేదన్నాడు. తన కంటే క్లార్‌ హూపర్‌ను రిచర్డ్స్ ఎక్కువగా ఇష్టపడతాడని పేర్కొన్నాడు.

Also Read: CMF Buds Pro 2 Price: సూపర్ డిజైన్‌.. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 43 గంటలు నాన్‌స్టాప్‌గా..!

కార్ల్ హూపర్‌ వెస్టిండీస్ తరఫున 102 టెస్టులు, 227 వన్డేలు ఆడాడు. రెండు ఫార్మాట్లలో 11 వేలకు పైగా రన్స్ చేశాడు. సచిన్ భారత్ తరఫున 200 టెస్టులు, 463 వన్డేలు, ఒక టీ20 ఆడాడు. దాదాపుగా 35 వేల రన్స్ చేశాడు. టెస్టుల్లో (15,921), వన్డేల్లో (18,426) ఆల్ టైమ్ టాప్‌ స్కోరర్‌గా సచిన్ కొనసాగుతున్నాడు. బ్రియాన్ లారా వెస్టిండీస్ తరఫున 131 టెస్టులు, 299 వన్డేలు ఆడాడు. లారా టెస్టుల్లో (400), ఫస్ట్ క్లాస్ క్రికెట్ (501)లో అత్యధిక స్కోరు చేసిన బ్యాటర్‌గా ఉన్నాడు.