మరికొన్ని గంటల్లో 2026 T20 వరల్డ్ కప్ చివరి మ్యాచ్ భారత్- న్యూజిలాండ్ మధ్య జరుగనున్నది. ఈ రెండు జట్లు మార్చి 8న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో తలపడనున్నాయి. ఈ ఫైనల్ మ్యాచ్‌కు ముందు, డేంజరస్ న్యూజిలాండ్ బౌలర్ తన విధ్వంసకర బౌలింగ్‌తో మొత్తం క్రికెట్ వరల్డ్ ని షేక్ చేశారు. ఈ బౌలర్ 5 బంతుల్లో 5 వికెట్లు పడగొట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు. న్యూజిలాండ్‌లో జరిగిన ప్లంకెట్ షీల్డ్ మ్యాచ్‌లో రెండవ రోజున బ్రెట్ రాండెల్ ఈ అద్భుతమైన ఘనతను సాధించాడు.
వరుసగా 5 బంతుల్లో 5 వికెట్లు
న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ బ్రెట్ రాండాల్ ప్లంకెట్ షీల్డ్‌లో సెంట్రల్ స్టాగ్స్ తరపున ఆడుతున్నాడు. నార్తర్న్ డిస్ట్రిక్ట్స్ బ్యాట్స్‌మెన్‌పై ఈ అద్భుతమైన ఘనతను సాధించాడు. కొత్త బంతితో బౌలింగ్ చేసిన రాండాల్ మూడవ ఓవర్ చివరి బంతికి తన మొదటి వికెట్ తీసుకున్నాడు. ఆ తర్వాత తదుపరి ఓవర్‌లోని మొదటి నాలుగు బంతుల్లో వరుస బ్యాట్స్‌మెన్‌లను అవుట్ చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. బోర్డులో కేవలం 9 పరుగుల వద్ద నార్తర్న్ డిస్ట్రిక్ట్స్ తమ టాప్ ఐదు బ్యాట్స్‌మెన్‌లను కోల్పోయింది.
Also Read:Mohammad Amir: మొహమ్మద్ అమీర్ జోస్యం.. ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియాకు కలిసొచ్చేనా?
ఈ ఇన్నింగ్స్‌లో బ్రెట్ రాండాల్ తన మెరుపు బౌలింగ్‌తో ఏడు వికెట్లు పడగొట్టాడు. ఒంటిచేత్తో నార్తర్న్ డిస్ట్రిక్ట్‌లను నాశనం చేశాడు. నార్తర్న్ డిస్ట్రిక్ట్స్ 32.2 ఓవర్లలో కేవలం 82 పరుగులకే ఆలౌట్ అయింది. సెంట్రల్ స్టాగ్స్ మొదట బ్యాటింగ్ చేస్తున్నప్పుడు 373 పరుగులు చేసింది. సెంట్రల్ స్టాగ్స్ తరపున ఏ బౌలర్‌కైనా బ్రెట్ రాండాల్ అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు ఇది. జట్టు తరపున హ్యాట్రిక్ తీసిన ఎనిమిదో బౌలర్‌గా కూడా నిలిచాడు. ఈ పర్ఫామెన్స్ మ్యాచ్‌పై జట్టు పట్టును బలోపేతం చేసింది.
Five wickets in five balls for Central Districts' Brett Randell – the first-ever instance in first-class cricket! pic.twitter.com/7qdJ9JPSxx
— Rahul (@exceedingxpuns) March 8, 2026
