Breath Can Be Used To Unlock Smartphones: స్మార్ట్‌ఫోన్‌ను అన్‌లాక్ చేయాలంటే.. సాధారణంగా మనం ప్యాటర్న్, నంబర్స్, ఫింగర్ లేదా ఐరిస్ ఉపయోగిస్తాం. ఇకపై శ్వాస (బ్రీత్)తో కూడా ఫోన్ అన్‌లాక్ చేయొచ్చు. శ్వాసతో స్మార్ట్‌ఫోన్‌ను అన్‌లాక్ చేసే దిశగా ఐఐటీ మద్రాస్‌లోని అప్లైడ్ మెకానిక్స్ మరియు బయోమెడికల్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ మహేష్ పంచాగ్నుల నేతృత్వంలోని పరిశోధనా బృందం టెక్నాలజీని అభివృద్ధి చేస్తోంది. ఈ శ్వాస పరిజ్ఞానాన్ని ఆచరణాత్మక అప్లికేషన్‌లుగా అభివృద్ధి చేశాక.. సెల్‌ఫోన్ అన్‌లాక్‌తో పాటు భద్రతాపరమైన కార్యకలాపాల కోసం ఉపయోగించవచ్చని ప్రొఫెసర్ మహేష్ చెప్పారు.
‘వ్యక్తి ఊపిరి వదిలేటప్పుడు శ్వాసకోశం ద్వారా ఊపిరితిత్తుల నుంచి గాలి బయటకు వస్తుంది. ప్రతి మనిషి శ్వాసకోశంలో తేడా ఉంటుంది. దీంతో గాలి వేగంలో హెచ్చుతగ్గులు ఉంటాయి. దీని ఆధారంగా ఒక వ్యక్తి నుంచి.. మరొక వ్యక్తిని వేరు చేయడం సాధ్యమవుతుందని ఈ అధ్యయనం ద్వారా మేం చూపించాం. ఈ టెక్నాలజీని మరింత మెరుగుపరచడానికి మా వద్ద కొన్ని ఆలోచనలు ఉన్నాయి’ అని ప్రొఫెసర్ మహేష్ పంచాగ్నుల తెలిపారు. వేలిముద్రలు, కంటి పాప ప్రతి మనిషికి వేర్వేరుగా ఉన్నట్లే.. శ్వాస కూడా వేర్వేరుగా ఉంటుంది.
Also Read: Delhi Crime: ఢిల్లీలో దారుణం.. అసహజ శృంగారానికి ఒత్తిడి చేసిన యువకుడు హత్య!
‘ఈ సాంకేతికతను ఉపయోగించడానికి మానవుడు జీవించి ఉండటం అవసరం. కాబట్టి ఇది మనుగడకు రుజువుగానూ ఉపయోగపడుతుంది. ఈ టెక్నాలజీని ఉపయోగించి శ్వాసకోశ సమస్యలతో బాధపడేవారికి ఇన్‌హేలేషన్ థెరపీ చేయొచ్చు. శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న వ్యక్తికి ఈ టెక్నాలజీ ద్వారా ఔషధం ఎంతో మోతాదును ఇవ్వాలో ముందే నిర్ణయించవచ్చు’ అని ప్రొఫెసర్ మహేష్ పేర్కొన్నారు. ఈ టెక్నాలజీ వైద్యరంగంలోనూ ఎంతో ఉపయోగపడుతందన్నారు.