హైదరాబాద్ మహానగరం తోమి జూబ్లీహిల్స్ నియోజకవర్గంకో ఉన్న వెంగళరావు నగర్ డివిజన్ బీఆర్ఎస్ కార్పొరేటర్ దేదీప్య రావు పై దాడి చోటు చేసుకుంది. ఈ సంఘటన మంగళవారం రాత్రి సమయంలో జరిగింది. ఇందుకు సంబంధించిన సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిదిలోని ఫ్లెక్సీల వివాదం కారణంగా ఈ ఘర్షణ నెలకొందని సమాచారం అందుతోంది.
Read Also: Germany : తవ్వకాల్లో లభించిన 1000 అస్థిపంజరాలు
ఈ కారణం చేతనే వెంగళరావు నగర్ డివిజన్ బీఆర్ఎస్ కార్పొరేటర్ దేదీప్య రావు పై దాడి జరిగిందని అర్ధమవుతోంది. ఇకపోతే ఈ సంఘటనలో స్వల్ప గాయాలతో బీఆర్ఎస్ కార్పొరేటర్ దేదీప్య రావు బయటపడ్డారు. ఈ ఘటనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మహిళలు సంఘటనకు పాల్పడినట్లు సమాచారం. ఈ పరిణామంతో జూబ్లీహిల్స్ పీఎస్ లో ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ కార్పొరేటర్ దేదీప్య రావుతో పాటు, ఆమె భర్త విజయ ముదిరాజ్. ఇకపోతే ఈ సంఘటనకి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
