Martin Guptill: అంతర్జాతీయ క్రికెట్‌కు మరో స్టార్ ప్లేయర్ వీడ్కోలు పలికాడు. న్యూజిలాండ్‌కు చెందిన సీనియర్ బ్యాట్స్‌మెన్ మార్టిన్ గప్టిల్ తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కు అధికారికంగా రిటైర్మెంట్ ప్రకటించాడు. 2009లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగు పెట్టిన గప్టిల్, గత రెండు సంవత్సరాల నుండి న్యూజిలాండ్ ప్లేయింగ్ జట్టులో స్థానం సంపాదించుకోకలేకపోతున్నాడు. 14 ఏళ్ల సుదీర్ఘ క్రికెట్ కెరీర్‌ను పూర్తి చేసిన గప్టిల్, న్యూజిలాండ్ తరఫున మూడు ఫార్మాట్లలో ఆడాడు. అయితే, గప్టిల్ ఇంకా టీ20 లీగ్ క్రికెట్‌లో ఆడుతూనే ఉంటాడు.
Also Read: Aggressive Elephant: ఉత్సవాల ఊరేగింపులో రెచ్చిపోయిన గజరాజు
మార్టిన్ గప్టిల్, న్యూజిలాండ్ తరఫున అత్యధిక టీ20 పరుగులు చేసిన ఆటగాడు. అలాగే, 2015 వన్డే ప్రపంచకప్‌లో డబుల్ సెంచరీ సాధించి రికార్డ్ సృష్టించాడు. అలాగే వన్డేలో న్యూజిలాండ్ తరఫున అత్యధిక పరుగులు చేసిన మూడో ఆటగాడిగా కూడా రికార్డ్ ఉంది. తన రిటైర్మెంట్‌ను ప్రకటించిన గప్టిల్.. “చిన్నప్పటి నుండి న్యూజిలాండ్ కోసం ఆడాలని నా కల ఉండేది. అలా నా దేశం కోసం 367 మ్యాచ్‌లు ఆడినందుకు నేను చాలా అదృష్టవంతుడిగా భావిస్తున్నాను” అని చెప్పాడు. అలాగే, నాకు శిక్షణనిచ్చిన సహచరులు, కోచ్‌లు, ఇంకా నా మేనేజర్ లీన్నే మెక్‌గోల్డ్‌రిక్‌కు ధన్యవాదాలు తెలిపారు. మీరు చేసిన పనులన్నీ ఎప్పటికీ మరిచిపోనని అన్నారు.
Also Read: Har Ghar Lakhpati: ఎస్‌బీఐలో అకౌంట్ ఉందా?.. రోజుకు రూ. 85 పొదుపుతో చేతికి రూ. లక్ష పొందండి!
మార్టిన్ గప్టిల్, న్యూజిలాండ్ తరఫున మొత్తం 198 వన్డేలు, 122 టీ20లు, 47 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. టెస్టుల్లో 17 హాఫ్ సెంచరీలు, 3 సెంచరీలతో 2586 పరుగులు చేశాడు. అలాగే వన్డేల్లో 7346 పరుగులతో, 41.73 సగటుతో 39 అర్ధ సెంచరీలు, 18 సెంచరీలు చేశాడు. ఇంకా, టీ20లలో 3531 పరుగులు చేయడంతో పాటు 31.81 సగటుతో 2 సెంచరీలు, 20 అర్ధ సెంచరీలు చేశాడు. గప్టిల్ అంతర్జాతీయ క్రికెట్‌లో తన 14 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణానికి గుడ్ బాయ్ చెప్పడంతో క్రికెట్ ప్రపంచం అతనికి శుభాకాంక్షలు తెలియజేస్తోంది.