Site icon NTV Telugu

Haleem : హలీం సెంటర్‌ వద్ద ఫైట్‌.. దేనికోసమంటే..!

Haleem Center Fight

Haleem Center Fight

రంజాన్ మాసంలో బిర్యానీతో పాటు హైదరాబాదీ హలీమ్ తప్పనిసరిగా ఉండాలి. అయితే.. హలీంకు హైదరాబాద్‌కు ఫేమస్‌ అనే చెప్పాలి. అయితే.. నిన్న రాత్రి ఓ హలీం సెంటర్‌ వద్ద ఘర్షణ చోటు చేసుకుంది. నిన్న రాత్రి ముషీరాబాద్ 4 చిల్లీస్ హోటల్ వద్ద స్ట్రీట్ ఫైట్ జరిగింది. వివరాల్లోకి వెళితే.. 4 చిల్లీస్ హోటల్ వద్ద ఏర్పాటు చేసిన ఓ హలీం సెంటర్‌కు కస్టమర్‌ వచ్చాడు. హలీం ఆర్డర్‌ ఇచ్చాడు.. అయితే.. హలీంను ఆరించిన సదరు వినియోగదారుడు తిరిగివెళ్తుంటే.. హలీం సెంటర్‌ నిర్వాహకులు డబ్బులు అడగడంతో మొదలైంది రచ్చ. నేను డబ్బులు ముందే ఇచ్చానని కస్టమర్‌ అంటే.. నువ్వు డబ్బులు ఇవ్వలేదని హలీం సెంటర్‌ నిర్వాహకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇలా చిలికి చిలికి గాలివానల వారి మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఇటు కస్టమర్‌ వర్గం.. అటు హలీం సెంటర్‌ వర్గం మధ్య ముష్టియుద్ధం మొదలైంది. ఆ ఘర్షణ కాస్త రోడ్డుపైకి రావడంతో.. దాదాపు 20 నిమిషాలపాటు ట్రాఫిక్‌ స్థంబించిపోయింది. అటుగా వెళ్తున్న వాహనదారులు వీళ్ల ఘర్షణను తిలకించారు. అయితే.. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Exit mobile version