Site icon NTV Telugu

Breaking: నేపాల్‌లో నదిలో పడిపోయిన 40 మందితో ప్రయాణిస్తున్న భారతీయ ప్రయాణీకుల బస్సు..

Bus Accident

Bus Accident

Bus Accident: నేపాల్‌ దేశంలో భారీ ప్రమాదం జరిగినట్లు సమాచారం అందుతోంది. 40 మంది భారతీయులతో వెళ్తున్న బస్సు నదిలో పడిపోయిందని సమాచారం. ఘటన నేపథ్యంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. చాలా మంది మృతి చెందే అవకాశం ఉందని సమాచారం అందుతోంది. ఘటనకు సంబంధించి నేపాల్ పోలీసు అధికారులు మాట్లాడుతూ.. 40 మందితో ప్రయాణిస్తున్న భారతీయ ప్రయాణీకుల బస్సు తనహున్ జిల్లాలో మర్స్యంగ్డి నదిలో పడిపోయింది.

Tamilnadu : కూతురిని కాపాడేందుకు భర్తను హత్య చేసిన భార్య.. కోర్టు షాకింగ్ తీర్పు

జిల్లా పోలీసు కార్యాలయం తనహున్ డీఎస్పీ దీప్‌కుమార్ రాయ ఈ విషయాన్ని ధృవీకరించారు. UP FT 7623 నంబర్ ప్లేట్ ఉన్న బస్సు నదిలో పడిపోయిందని ఆయన చెప్పారు. అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. బస్సు పోఖారా నుంచి ఖాట్మండుకు వెళ్తోంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

తాజాగా అందిన సమాచారం మేరకు ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇప్పటి వరకు 14 మంది చనిపోగా, 16 మందిని రక్షించారు. అయితే, ఇది అధికారికంగా ధృవీకరించబడలేదు. ఈ బస్సు పోఖారా నుంచి ఖాట్మండు వెళ్తోంది. పోలీసులు, రెస్క్యూ టీం ఘటనాస్థలికి చేరుకున్నాయి.

Exit mobile version