Site icon NTV Telugu

Breaking: చైనాలో భారీ పేలుడు.. చెల్లా చెదురుగా భవనాల శిథిలాలు..!

China

China

చైనాలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. అయితే, డ్రాగన్ కంట్రీ కాలమానం ప్రకారం ఇవాళ (బుధవారం) ఉదయం 7.55 గంటలకు చైనా రాజధాని బీజింగ్‌ నగరానికి 50 కిలో మీటర్ల దూరంలో ఉన్న యాంజియావోలో భారీ పేలుడు సంభవించింది. యాంజియావోలోని ఒక పాత భవనంలోని కింది అంతస్తులో నడుపుతున్న రెస్టారెంట్‌ లో గ్యాస్‌ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి అక్కడ ఉన్న చుట్టు పక్కల భవనాలతో పాటు వాహనాలు కూడా పెద్ద ఎత్తున ధ్వంసమయ్యాయి.

Read Also: MLA Shanampudi: ఢిల్లీకి పిలిచి బీజేపీ కండువా కప్పుకోమన్నారు.. సైదిరెడ్డి ఆడియో వైరల్..

ఇక, పేలుడు సంభవించిన భవనాల శిధిలాలు చుట్టు పక్కల ఆ ప్రాంతమంతా చెల్లాచెదురుగా పడ్డాయి. ఆ పేలుడు సంభవించిన తర్వాత అక్కడ భారీ ఎత్తున్న నీలి మంటలు ఎగిసిపడినట్లు వైరల్ అవుతున్న వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక పోతే, ఈ భారీ పేలుడులో ఇంత వరకు ఎంత మంది చనిపోయారోన్న వివరాలు మాత్రం ఇంకా తెలియ రాలేదు.. పేలుడు ధాటికి గాయపడ్డ వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు అధికారులు. పేలుడు సంభవించిన కొద్దిసేపటికే ఆ ప్రాంతానికి రెస్క్యూ టీమ్‌ వచ్చి సహాయక చర్యలు మొదలు పెట్టింది.

Exit mobile version