NTV Telugu Site icon

Pension: పెన్షన్‌ కోసం చనిపోయిన వ్యక్తితో బ్యాంకుకు.. చివరకి..

6

6

తాజాగా ఓ మహిళ చనిపోయిన వ్యక్తిని తీసుకొని పెన్షన్ కోసం బ్యాంకుకు వచ్చి అడ్డంగా బుక్ అయింది. సదరు మహిళా తీసుకొచ్చిన వ్యక్తి కదలకుండా ఉండడంతో బ్యాంక్ అధికారులకు అనుమానం రావడంతో అసలు విషయం బయటకు వచ్చింది. దీంతో బ్యాంక్ లో ఉన్నవారు కొందరు అక్కడ పరిస్థితిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్త వైరల్ గా మారింది. ఇక అసలు విషయం ఏమిటంటే..

Also read: Amit Shah: రాహుల్‌ బాబా.. ఆర్టికల్ 370 రద్దై ఐదేళ్లు అవుతోంది..

ఈ సంఘటన బ్రెజిల్ దేశంలో జరిగింది. బ్రెజిల్ దేశానికి చెందిన ఎరికా డి సౌజా వియెరా నూన్స్ అనే మహిళ ఆవిడ మేనమామ పాలో రాబర్టోను వీల్ చైర్ లో బ్యాంక్ లోపలికి తీసుకోవచ్చింది. అయితే బ్యాంక్ లోపలికి రాకముందే పాలో రాబర్టో చనిపోయాడు. ఇకపోతే ఆయన పేరు మీద ఉన్న పెన్షన్ మొత్తాన్ని క్లైమ్ చేసుకోవడానికి అతడు ఇంకా బతికి ఉన్నట్లే వీల్ చైర్ పై సదరు మహిళ అతనిని బ్యాంకుకు తీసుకువచ్చింది. అలా బ్యాంకుకు తీసుకోవచ్చి పెన్షన్ మొత్తాన్ని విత్డ్రా చేయడానికి ప్రయత్నించింది. ఈ సమయంలో బ్యాంకు పేపర్స్ పై సంతకం పెట్టించడానికి కూడా ఆవిడ ట్రై చేసింది. ఇదివరకు తన మేనమామ అనారోగ్యంగా ఉన్న సమయంలో ఆవిడ చూసుకుందన్నట్లు తెలిపింది.

Also read: Banjara Hills Police: స్టోర్స్‌ అద్దాలను ధ్వంసం ఘటన.. ఛేదించిన బంజారాహిల్స్ పోలీసులు

అయితే పాలో రాబర్టో పేరుమీద ఆవిడ లోన్ అప్లై చేయడం కాస్త విడ్డూరంగా అనిపించింది. పాలో రాబర్టో చనిపోగా .. ఆ విషయాన్ని దాచిపెట్టి మరి తన మేనమామను వీల్ చైర్ లో బ్యాంకుకు తీసుకోవచ్చి సంతకం పెట్టించడానికి ప్రయత్నం చేసింది. కాకపోతే అతడు ఏమాత్రం స్పందించకపోవడంతో బ్యాంకు సిబ్బందికి అనుమానం రావడంతో ఆరా తీయడం ప్రారంభించారు అధికారులు. దాంతో అసలు విషయాన్ని బయట పెట్టింది సదరు యువతీ.