Site icon NTV Telugu

Brazilian Billionaire: ఇది మామూలు ప్రేమ కాదు.. రూ.10 వేల కోట్లకు అధిపతిని చేశాడు..!

Neymar

Neymar

Brazilian Billionaire: ఇష్టమైన ఆటగాడి మీద, సినిమా తారలపై ప్రజలకు అభిమానం ఉండటం సాధారణమైన విషయం. కొందరు వాళ్ల అభిమాన తారలపై వారికి ఉన్న ప్రేమను విభిన్న రకాలుగా వ్యక్తపరుస్తుంటారు. ఎంత అభిమానం ఉన్నా వాళ్ల యావదాస్తిని రాసి ఇచ్చిన సంఘటనలు మాత్రం ఎప్పుడు వెలుగు చూసిన దాఖలాలు లేవు. కానీ ఓ అభిమాని తనకు ఎంతో ఇష్టమైన ఫుట్ బాల్ ప్లేయర్‌కు తన యావదాస్తిని వీలునామాగా రాశాడు. మీరు ఆ అభిమాని రాసిచ్చిన ఆస్తి ఎంత ఉంటుందని అనుకుంటున్నారు.. అక్షరాల రూ.10 వేల కోట్లు. ఇది నిజంగా నిజం. ఈ వార్త సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తుంది. ఇంతకీ ఆ అభిమాని ఎవరు.. తన అభిమాన ఆటగాడు ఎవరు అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..

READ ALSO: కేరళ సంస్కృతిలో మునిగిన మౌనీ రాయ్… ఓనం చీర లుక్‌తో సోషల్ మీడియాలో హవా!

అభిమానం సల్లగుండా..
నిజంగా ఇది మామూలు ప్రేమ కాదు. తనకు ఎటువంటి సంబంధం లేని వ్యక్తికి రూ.10 వేల కోట్లను వీలునామగా రాయడం అంటే మాటలు కాదు. ఇది బ్రెజిల్‌లో వెలుగుచూసింది. ఒక బ్రెజిలియన్ వ్యక్తి, బ్రెజిల్ ఫుట్‌బాల్ స్టార్ ప్లేయర్ నెయ్‌మార్‌కు రూ.10 వేల కోట్లను రాసిచ్చాడు. పోర్టో అలెగ్రేకు చెందిన 31 ఏళ్ల బిలియనీర్‌కు పిల్లలు లేరు. ఇటీవల ఆయన మరణించే ముందు తన అభిమాన సాకర్ నెయ్‌మార్‌ను తన సంపదకు ఏకైక వారసుడిగా పేర్కొన్నాడు. దీని విలువ R$6.1 బిలియన్ (సుమారు $1 బిలియన్ USD)గా అంచనా. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వీలునామా అధికారికంగా జూన్ 12, 2025న నమోదు చేశారు. ఇక్కడ విశేషం ఏమిటంటే ఆ వ్యాపారవేత్తకు ఈ ఫుట్‌బాల్ సూపర్‌స్టార్‌తో ఎటువంటి కుటుంబ లేదా వృత్తిపరమైన సంబంధాలు లేవు.

నెయ్‌మార్‌ అంటే ఇష్టం..
“నాకు నెయ్‌మార్‌ అంటే ఇష్టం, నేను అతనితో చాలా గుర్తింపు పొందుతాను,” అని గుర్తు తెలియని బిలియనీర్ చెప్పారు. తన అభిమాన సాకర్‌లో “అరుదైన విలువలు” చూశానని, ముఖ్యంగా ఆయన తన తండ్రి నెయ్‌మార్ సీనియర్‌తో ఉన్న సన్నిహిత బంధం ద్వారా కదిలిపోయానని చెప్పారు. ఈ వ్యాపారవేత్తకు నెయ్‌మార్‌ అంటే కేవలం ఒక సాకర్ మాత్రమే కాదు. అంత కంటే ఎక్కువ అని పేర్కొన్నారు.

నెయ్‌మార్ శిబిరం స్పందిస్తూ..
ఈ బిలియనీర్ వీలునామపై నెయ్‌మార్ ప్రతినిధులు స్పందించారు. వారసత్వం గురించి తమకు ఇంకా అధికారికంగా తెలియజేయలేదని స్పష్టం చేశారు. అయినప్పటికీ ఈ వార్త ఇప్పటికే బ్రెజిల్ అంతటా ప్రకంపనలు సృష్టిస్తుంది. దేశంలోనే అత్యంత సంపన్న వ్యక్తుల్లో ఒకరైన నెయ్‌మార్‌కు వారసత్వం ఏమిటనే దానిపై దేశ ప్రజలు చర్చించుకుంటున్నారు.

కెరీర్ కోసం నెయ్‌మార్‌ పోరాటం..
నెయ్‌మార్‌‌కు ఇప్పుడు 33 ఏళ్లు నిండాయి. ఆయన మరోసారి శాంటాస్ FC తరపున ఆడుతున్నారు. ఈక్రమంలో ఆయన 2026 FIFA ప్రపంచ కప్‌కు ముందు అంతర్జాతీయ వేదికపై తన స్థానాన్ని నిలుపుకోవడానికి తీవ్రంగా పోరాడుతున్నాడు. ప్రపంచ కప్ అర్హత పోటీలలో నిరాశపరిచే ఫలితాల తర్వాత ప్రముఖ ఇటాలియన్ మేనేజర్ కార్లో అన్సెలోట్టి నేతృత్వంలో బ్రెజిల్ కొత్త యుగంలోకి అడుగుపెడుతోంది. కానీ ఈ కొత్త అధ్యాయంలో నేమార్ పాత్ర అనిశ్చితంగానే ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సెప్టెంబర్ 2025 అంతర్జాతీయ విండో కోసం అన్సెలోట్టి తన జట్టు జాబితాను విడుదల చేసినప్పుడు నేమార్‌ పేరును తొలగించారు.

READ ALSO: Hyderabad Drug: హైదరాబాద్‌లో డ్రగ్స్ ఫ్యాక్టరీ గుట్టురట్టు.. రూ. 12 వేల కోట్ల మాదకద్రవ్యాలు స్వాధీనం..

Exit mobile version