Brazilian Billionaire: ఇది మామూలు ప్రేమ కాదు.. రూ.10 వేల కోట్లకు అధిపతిని చేశాడు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Brazilian Billionaire: ఇష్టమైన ఆటగాడి మీద, సినిమా తారలపై ప్రజలకు అభిమానం ఉండటం సాధారణమైన విషయం. కొందరు వాళ్ల అభిమాన తారలపై వారికి ఉన్న ప్రేమను విభిన్న రకాలుగా వ్యక్తపరుస్తుంటారు. ఎంత అభిమానం ఉన్నా వాళ్ల యావదాస్తిని రాసి ఇచ్చిన సంఘటనలు మాత్రం ఎప్పుడు వెలుగు చూసిన దాఖలాలు లేవు. కానీ ఓ అభిమాని తనకు ఎంతో ఇష్టమైన ఫుట్ బాల్ ప్లేయర్‌కు తన యావదాస్తిని వీలునామాగా రాశాడు. మీరు ఆ అభిమాని రాసిచ్చిన ఆస్తి ఎంత ఉంటుందని అనుకుంటున్నారు.. అక్షరాల రూ.10 వేల కోట్లు. ఇది నిజంగా నిజం. ఈ వార్త సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తుంది. ఇంతకీ ఆ అభిమాని ఎవరు.. తన అభిమాన ఆటగాడు ఎవరు అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..
READ ALSO: కేరళ సంస్కృతిలో మునిగిన మౌనీ రాయ్… ఓనం చీర లుక్‌తో సోషల్ మీడియాలో హవా!
Also Read
- Karnataka Politics: కర్ణాటక రాజకీయంలో హైడ్రామా.. కేబినెట్ కొలువుదీరిన కొద్దిరోజులకే మంత్రి రాజీనామా!
- వరల్డ్ కప్ గెలిచినా అసలు ట్రోఫీ దక్కదట.! 'FIFA World Cup' గురించి తెలియని విషయాలు మీకోసం..
- 2000 vs 2026: పెట్రోల్ రూ. 26, సిలిండర్ రూ.157.. ఈ 26 ఏళ్లలో నిత్యావసరాల ధరలు ఎంత పెరిగాయో తెలుసా?
- Pat Cummins: "ఆ పిల్లాడు గ్రౌండ్లో కాదు.. స్కూల్లో ఉంటే బాగుండేది".. వైభవ్ విధ్వంసంపై SRH కెప్టెన్ కమిన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు..
అభిమానం సల్లగుండా..
నిజంగా ఇది మామూలు ప్రేమ కాదు. తనకు ఎటువంటి సంబంధం లేని వ్యక్తికి రూ.10 వేల కోట్లను వీలునామగా రాయడం అంటే మాటలు కాదు. ఇది బ్రెజిల్లో వెలుగుచూసింది. ఒక బ్రెజిలియన్ వ్యక్తి, బ్రెజిల్ ఫుట్‌బాల్ స్టార్ ప్లేయర్ నెయ్‌మార్‌కు రూ.10 వేల కోట్లను రాసిచ్చాడు. పోర్టో అలెగ్రేకు చెందిన 31 ఏళ్ల బిలియనీర్‌కు పిల్లలు లేరు. ఇటీవల ఆయన మరణించే ముందు తన అభిమాన సాకర్ నెయ్‌మార్‌ను తన సంపదకు ఏకైక వారసుడిగా పేర్కొన్నాడు. దీని విలువ R$6.1 బిలియన్ (సుమారు $1 బిలియన్ USD)గా అంచనా. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వీలునామా అధికారికంగా జూన్ 12, 2025న నమోదు చేశారు. ఇక్కడ విశేషం ఏమిటంటే ఆ వ్యాపారవేత్తకు ఈ ఫుట్‌బాల్ సూపర్‌స్టార్‌తో ఎటువంటి కుటుంబ లేదా వృత్తిపరమైన సంబంధాలు లేవు.
నెయ్మార్ అంటే ఇష్టం..
“నాకు నెయ్మార్ అంటే ఇష్టం, నేను అతనితో చాలా గుర్తింపు పొందుతాను,” అని గుర్తు తెలియని బిలియనీర్ చెప్పారు. తన అభిమాన సాకర్‌లో “అరుదైన విలువలు” చూశానని, ముఖ్యంగా ఆయన తన తండ్రి నెయ్మార్ సీనియర్‌తో ఉన్న సన్నిహిత బంధం ద్వారా కదిలిపోయానని చెప్పారు. ఈ వ్యాపారవేత్తకు నెయ్మార్ అంటే కేవలం ఒక సాకర్ మాత్రమే కాదు. అంత కంటే ఎక్కువ అని పేర్కొన్నారు.
నెయ్మార్ శిబిరం స్పందిస్తూ..
ఈ బిలియనీర్ వీలునామపై నెయ్మార్ ప్రతినిధులు స్పందించారు. వారసత్వం గురించి తమకు ఇంకా అధికారికంగా తెలియజేయలేదని స్పష్టం చేశారు. అయినప్పటికీ ఈ వార్త ఇప్పటికే బ్రెజిల్ అంతటా ప్రకంపనలు సృష్టిస్తుంది. దేశంలోనే అత్యంత సంపన్న వ్యక్తుల్లో ఒకరైన నెయ్‌మార్‌కు వారసత్వం ఏమిటనే దానిపై దేశ ప్రజలు చర్చించుకుంటున్నారు.
కెరీర్ కోసం నెయ్మార్ పోరాటం..
నెయ్‌మార్‌కు ఇప్పుడు 33 ఏళ్లు నిండాయి. ఆయన మరోసారి శాంటాస్ FC తరపున ఆడుతున్నారు. ఈక్రమంలో ఆయన 2026 FIFA ప్రపంచ కప్‌కు ముందు అంతర్జాతీయ వేదికపై తన స్థానాన్ని నిలుపుకోవడానికి తీవ్రంగా పోరాడుతున్నాడు. ప్రపంచ కప్ అర్హత పోటీలలో నిరాశపరిచే ఫలితాల తర్వాత ప్రముఖ ఇటాలియన్ మేనేజర్ కార్లో అన్సెలోట్టి నేతృత్వంలో బ్రెజిల్ కొత్త యుగంలోకి అడుగుపెడుతోంది. కానీ ఈ కొత్త అధ్యాయంలో నేమార్ పాత్ర అనిశ్చితంగానే ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సెప్టెంబర్ 2025 అంతర్జాతీయ విండో కోసం అన్సెలోట్టి తన జట్టు జాబితాను విడుదల చేసినప్పుడు నేమార్ పేరును తొలగించారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi Record: వైభవ్ సూర్యవంశీకి గుడ్‌న్యూస్.. ఇక క్రికెట్ దిగ్గజం సచిన్ రికార్డు బద్దలే!
-
RBI MPC 2026: ఆర్బీఐ కీలక నిర్ణయం.. రెపో రేటు 5.25% వద్ద యథాతథం.. లక్షలాది మంది రుణగ్రహీతలకు ఊరట
-
Karnataka Politics: కర్ణాటక రాజకీయంలో హైడ్రామా.. కేబినెట్ కొలువుదీరిన కొద్దిరోజులకే మంత్రి రాజీనామా!
-
వరల్డ్ కప్ గెలిచినా అసలు ట్రోఫీ దక్కదట.! ‘FIFA World Cup’ గురించి తెలియని విషయాలు మీకోసం..
-
Ather Rizta Price Hike: పెరిగిన ఏథర్ రిజ్టా ధరలు.. ఏ వేరియంట్‌పై ఎంత ధర పెరిగిందో తెలుసా?
ట్రెండింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..