Site icon NTV Telugu

Jair Bolsonaro: మాజీ అధ్యక్షుడుకి సుప్రీం కోర్ట్ షాక్.. హౌస్ అరెస్ట్‌కి ఆదేశాలు!

Jair Bolsonaro

Jair Bolsonaro

Jair Bolsonaro: బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సొనారోకు భారీ షాక్ తగిలింది. కూటమి సహా.. తప్పుడు రాజకీయాల ఆరోపణల నేపథ్యంలో, ఆయన్ను హౌస్ అరెస్ట్ చేయాలని బ్రెజిల్ సుప్రీం కోర్ట్ న్యాయమూర్తి అలెగ్జాండ్రె డి మొరాయిస్ తాజాగా ఆదేశించారు. 2022 ఎన్నికల్లో తన ఓటమిని తిరస్కరించే కదలికల వెనుక బోల్సొనారో ఉండినట్లు కేసులో ఆరోపణలున్నాయి. ఆయనపై ఉన్న నిబంధనలను అతిక్రమించారనే కారణంతో హౌస్ అరెస్ట్ నిర్ణయం తీసుకున్నట్టు న్యాయమూర్తి పేర్కొన్నారు.

Red Fort: ఎర్రకోటలోకి ప్రవేశించేందుకు ప్రయత్నం చేసిన బంగ్లాదేశీ అక్రమ వలసదారులు.. ఢిల్లీ, గురుగ్రామ్‌లో అలర్ట్ !

ఇందులో మరింత సంచలనాత్మక అంశం ఏంటంటే.. ఈ కేసు కేవలం బ్రెజిల్ రాజకీయం వరకే పరిమితం కాకుండా, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కి కూడా సంబంధం ఉందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ట్రంప్ ఇటీవల బ్రెజిల్‌పై భారీ టారిఫ్‌లను విధిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని బోల్సొనారోపై న్యాయస్థానాలు తీసుకున్న చర్యల పట్ల వ్యతిరేకంగా చెబుతున్నారు. ట్రంప్ బోల్సొనారోకు ఒక లేఖ రాసి, మీపై జరుగుతున్న న్యాయ అక్రమాలన్ని చూసి నేను దిగులుగా ఉన్నాను. ఈ కేసును వెంటనే ముగించాలి అంటూ బహిరంగంగా మద్దతు తెలిపారు.

Jacqueline Fernandez : జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ఉమెన్ సెంట్రిక్ మూవీ?

ఇక కోర్ట్ ఆదేశాల మేరకు బ్రెజిల్ ఫెడరల్ పోలీస్‌లు బోల్సొనారో నివాసంలోకి వెళ్లి ఆయన సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నట్టు ధృవీకరించాయి. కోర్టు ఆదేశాల ప్రకారం, ఆయనకు న్యాయవాదులు లేదా ప్రత్యేకంగా అనుమతి పొందిన వారిని తప్ప వేరే ఎవరూ కలవడానికి అనుమతినివ్వలేదు. సెల్‌ఫోన్ వాడకాన్ని కూడా నిషేధించారు. ఆయన ప్రత్యక్షంగా గానీ, మూడవ వ్యక్తుల ద్వారా గానీ వినియోగించరాదు. బోల్సొనారో కుమారుడు ఎడువార్డో బోల్సొనారో ఈ కేసు మొదలైన సమయంలోనే అమెరికాకు వెళ్లిపోయి, వాషింగ్టన్‌లో తన తండ్రికి మద్దతు కూడగట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇకపోతే ట్రంప్ కూడా బోల్సొనారోకు బాసటగా నిలబడిన సంగతి తెలిసిందే.

Exit mobile version