BRAOU Ph.D: అంబేద్కర్ వర్సిటీలో పీహెచ్డీ ప్రోగ్రామ్స్.. నోటిఫికేషన్ విడుదల.. ఏ ఏ సబ్జెక్టుల్లో అంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం 2025-26 విద్యా సంవత్సరానికి గాను ఇంగ్లీష్, తెలుగు, కెమిస్ట్రీ, ఎకనామిక్స్, హిస్టరీ, సోషియాలజీ విభాగాల్లో పీహెచ్డీ (Ph.D.) ప్రోగ్రామ్‌లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. యూజీసీ నిబంధనలు-2022 ప్రకారం కంప్యూటర్ ఆధారిత ఎంట్రన్స్ టెస్ట్ (CBT), ఇంటర్వ్యూ ద్వారా ఈ ప్రవేశాలు ఉంటాయి. సంబంధిత అనుబంధ సబ్జెక్టులో కనీసం 55 శాతం మార్కులతో (SC/ST/BC/PwD అభ్యర్థులకు 50 శాతం) మాస్టర్స్ డిగ్రీ కలిగిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
UGC-JRF, CSIR NET, GATE, CEED లో అర్హత సాధించి ఫెలోషిప్ పొందిన అభ్యర్థులకు ప్రవేశ పరీక్ష నుంచి మినహాయింపు ఉంటుంది. అయితే వారు కూడా ఆన్లైన్లో నమోదు చేసుకుని ఫీజు చెల్లించి ఇంటర్వ్యూకు హాజరుకావాల్సి ఉంటుంది. ఇంగ్లీష్, తెలుగు, కెమిస్ట్రీ, ఎకనామిక్స్, హిస్టరీ, సోషియాలజీ సబ్జెక్టుల్లో పీహెచ్డీ చేసేందుకు అవకాశం కల్పించారు. ఇందులో తెలుగు సబ్జెక్టు మినహా మిగిలిన అన్ని సబ్జెక్టులకు బోధన, పరీక్షా మాధ్యమం ఇంగ్లీష్‌లోనే ఉంటుంది.
Also Read
- WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
- Pensions: పెన్షన్ల నిధులు విడుదల.. అక్టోబర్ 1వ తేదీ ఉదయం నుంచే పంపిణీ షురూ..
- New Train Service: ఏపీ రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. కొత్త రైలు వచ్చేసింది.. వారానికి 3 రోజులు..
- Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
ఆసక్తి గల అభ్యర్థులు విశ్వవిద్యాలయ పోర్టల్ www.braouonline.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. జనరల్ అభ్యర్థులకు నమోదు ఫీజు రూ. 1500 కాగా, SC/ST/BC/PwD అభ్యర్థులకు రూ. 1000 గా నిర్ణయించారు. ప్రవేశ పరీక్ష కేవలం హైదరాబాద్‌లోనే నిర్వహించబడుతుంది.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ, రుసుము చెల్లింపు 2026 సెప్టెంబర్ 7న ప్రారంభమైంది. ఎటువంటి ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు సమర్పించడానికి చివరి తేదీ 2026 అక్టోబర్ 6. రూ. 500 ఆలస్య రుసుముతో 2026 అక్టోబర్ 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
అభ్యర్థులు 2026 అక్టోబర్ 21 నుంచి వెబ్సైట్ ద్వారా హాల్ టిక్కెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. పీహెచ్డీ ప్రవేశ పరీక్ష 2026 అక్టోబర్ 25న మధ్యాహ్నం 02:00 గంటల నుంచి సాయంత్రం 05:00 గంటల వరకు జరుగుతుంది. ఇతర వివరాల కోసం విశ్వవిద్యాలయ అకాడమిక్ లేదా పరీక్షల నియంత్రణ అధికారులను సంప్రదించవచ్చు.
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!