NTV Telugu Site icon

Brahmanandam: ఎప్పుడు కనిపించని పాత్రలో బ్రహ్మానందం.. డైలాగ్స్ అదిరిపోయాయిగా..(వీడియో)

Brahmanandam

Brahmanandam

Brahmanandam As Duryodhana: బ్రహ్మానందం.. ఈ పేరుకు పరిచయం అక్కర్లేదని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యావత్ తెలుగు సినీ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించగలిగిన వ్యక్తులలో ఈయన మొదటి స్థానంలో ఉంటారు. తన సినిమాలతో ప్రపంచ గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించుకున్న ఆయన తన సినీ కెరియర్లో ఎన్నో పాత్రలను పోషించాడు. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో బ్రహ్మానందం దుర్యోధనుని పాత్రలో అదరగొట్టారు. దాదాపు నిమిషం పాటు ఉన్న ఈ వీడియోలో బ్రహ్మానందం డైలాగ్స్ తో అదరగొట్టారు. ఇక ఈ వీడియో సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే..

Rana Daggubati: మేం సౌత్ ఇండియన్స్ అంటూ.. షారుక్ కాళ్లు మొక్కిన రానా..(వీడియో)

బ్రహ్మానందం కేవలం కామెడీ మాత్రమే కాకుండా ఎలాంటి పాత్రనైనా చేయగలరని ఇదివరకే నిరూపించారు. ఇకపోతే తాజాగా ఆయన ‘ఉత్సవం’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. దిలీప్, రెజీనా హీరో హీరోయిన్లుగా రాబోతున్న ఉత్సవం సినిమా నాటకాల ఆధారితకతగా తెరకెక్కించారు. సెప్టెంబర్ 13న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, రాజేంద్రప్రసాద్, మధుబాల, నాజర్ ఇలా ప్రముఖులు చాలామంది సీనియర్ యాక్టర్స్ వివిధ పాత్రలలో నటించారు. సినిమాకి సంబంధించి తాజాగా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా అక్కడికి సినిమా నటీనటులందరూ వచ్చారు.

Prabhas : రెబల్ స్టార్ రెండు సినిమాలకు సంబంధించిన కీలక అప్ డేట్స్ ఇవే..

ఈ ఈవెంట్లో హాస్య బ్రహ్మ బ్రహ్మానందం కూడా హాజరయ్యారు. ఈ ఈవెంట్లో బ్రహ్మానందం దుర్యోధన వేషంలో ఉన్న వీడియోని ప్లే చేయగా అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. వీడియోలో దుర్యోధన వేషం వేసుకున్న ఆయన.. డైలాగ్స్ తో అదరగొట్టారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియోని ఓసారి వీక్షించండి.

Show comments