Brahmanandam : నేను ఈ స్థాయిలో ఉండటానికి కారణం వాళ్లే”: పుట్టినరోజు వేళ ఎమోషనల్ అయిన బ్రహ్మానందం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బ్రహ్మానందం 70వ పుట్టినరోజు సందర్భంగా ఆదివారం ఘనంగా సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఒక సాధారణ అధ్యాపకుడిగా జీవితాన్ని ప్రారంభించి, తన అద్భుతమైన హావభావాలతో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వరకు ఎదిగిన ఆయన ప్రయాణం ఒక అద్భుతం. బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాయాలన్నా, సోషల్ మీడియాలో మీమ్స్ సందడి చేయాలన్నా ఆయన ముఖం మీద పలికే ఒక్క ఎక్స్‌ప్రెషన్ చాలు. అయితే తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ఆయన 70వ పుట్టినరోజు వేడుకకు ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజుతో పాటు టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నటులంతా హాజరై బ్రహ్మీని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బ్రహ్మానందం మాట్లాడుతూ తన 42 ఏళ్ల నట ప్రయాణంలో ఎదురైన కష్టసుఖాలను పంచుకున్నారు.
Also Read : Niharika : బయటికి కనిపించడం లేదు కానీ.. గుండెల్లో చాలా బరువుని మోస్తున్నా..
Also Read
- Vikarabad: అనంతగిరి లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు మృతి
- Abhishek Sharma: పాకిస్థాన్‌కు అసలైన మొగుడు కాటేరమ్మకొడుకే.. పాక్‌పై అభిషేక్ శర్మ విధ్వంసం..!
- Silver Jubilee Fraternity Meet: కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. ముఖ్య అతిథిగా వెంకయ్య
- Sri City Boiler Blast: శ్రీ సిటీలో ఘోర ప్రమాదం.. టిల్ హెల్త్‌కేర్ పరిశ్రమలో బాయిలర్ పేలి ఇద్దరు మృతి
బ్రహ్మానందం మాట్లాడుతూ ‘నా విజయానికి కారణం నేను కాదు, ప్రేక్షకుల ఆశీస్సులేన’ అని వినమ్రంగా చెప్పారు. ‘నేను ఇన్ని సినిమాల్లో నటించానంటే అది నా గొప్పతనం కాదు, నన్ను నమ్మి అవకాశాలిచ్చిన దర్శక నిర్మాతలది. ముఖ్యంగా నేను ఇండస్ట్రీలోకి రావడానికి జంధ్యాల గారు, మెగాస్టార్ చిరంజీవి గారు, రామానాయుడు గారే కారణం. చిరంజీవి గారు నాలోని ప్రతిభను గుర్తించి, నన్ను వెంట పెట్టుకుని తీసుకెళ్లి మరీ ఇండస్ట్రీలోని పెద్దలందరికీ పరిచయం చేశారు. ‘అహ నా పెళ్ళంట’ సినిమా నా జీవితాన్నే మార్చేసింది. 42 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో కష్టాలు చూశాను కానీ, మీ ప్రేమ ముందు అవన్నీ చిన్నవైపోయాయి’ అంటూ కంటతడి పెట్టుకున్నారు.
తాజావార్తలు
-
Chiranjeevi: పైలట్ సాహసానికి కదిలిపోయిన చిరంజీవి! ‘జై హనుమాన్’ అంటూ మెగాస్టార్ ఎమోషనల్ ట్వీట్!
-
Vikarabad: అనంతగిరి లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు మృతి
-
October 15: అక్టోబర్ 15 నుంచి ఏటీఎంలలో సరికొత్త రూల్స్! ఇక ఆ చిక్కులు ఉండవు..
-
SH-93 Hindi Signboard Row: SH-93 హైవే బోర్డుపై హిందీ అక్షరాలు.. ఇద్దరు అధికారులు సస్పెండ్
-
Abhishek Sharma: పాకిస్థాన్‌కు అసలైన మొగుడు కాటేరమ్మకొడుకే.. పాక్‌పై అభిషేక్ శర్మ విధ్వంసం..!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!