Rakshabandhan: తెలుగు రాష్ట్రాల్లో రక్షా బంధన్ సంబరాలను ఘనంగా జరుపుకుంటున్నారు. తమ తోబుట్టువులకు రాఖీలు కడుతున్నారు. శుభాకాంక్షలు చెబుతున్నారు.. దీంతో.. రాఖీ షాపులు, స్వీట్ షాపులు కలకలలాడుతున్నాయి. రక్షాబంధన్(రాఖీ పౌర్ణమి) సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బ్రహ్మకుమారీస్ రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. స్పిరిచ్యువల్ ఆర్గనైజేషన్ బ్రహ్మకుమారీస్ సోదరీమణులు జయ, పద్మజ, రాధలు సీఎం జగన్‌కు రాఖీలు కట్టారు. బ్రహ్మకుమారీస్ ప్రధాన కార్యాలయం మౌంట్ అబూలో సెప్టెంబరులో జరగబోయే గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమానికి ముఖ్యమంత్రిని బ్రహ్మకుమారీస్ ప్రతినిధులు ఆహ్వానించారు.
Also Read: Peddireddy Ramachandra Reddy: ఇసుకను దోచిన వారే ఆరోపణలు చేయటం విడ్డూరం
అనంతరం రాఖీని పురస్కరించుకుని సీఎం వైఎస్ జగన్‌ను కలిసి సీఎం క్యాంప్ ఆఫీస్ హౌస్ కీపింగ్ మహిళలు రాఖీలు కట్టారు. వారిని ముఖ్యమంత్రి జగన్ ఆప్యాయంగా పలకరించారు. ముఖ్యమంత్రి చేతికి రాఖీలు కట్టి మహిళా సిబ్బంది అభిమానాన్ని చాటుకున్నారు. ఇదిలా ఉండగా బుధవారం నాడే మహిళా మంత్రులు తానేటి వనిత, విడదల రజని, పలువురు మహిళా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి రాఖీలు కట్టి అభినందనలు తెలిపారు. ఇక, రాఖీ పౌర్ణమి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మహిళా లోకానికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అంటూ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టారు.. వారు చూపుతున్న ప్రేమాభిమానాలకు సదా కృతజ్ఞతుడినని అన్నారు. మహిళల సంక్షేమమే లక్ష్యంగా.. వారి రక్షణే ధ్యేయంగా పాలన సాగిస్తున్నందుకు సంతోషిస్తున్నానని తెలిపారు సీఎం జగన్.. ఒక అన్నగా, ఒక తమ్ముడిగా ఎప్పుడూ అండగా ఉంటానని మాట ఇస్తున్నట్లు పేర్కొన్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.