Virat Kohli: విరాట్ కోహ్లీ.. ఇలా అయితే కష్టమే: హాగ్
- న్యూజిలాండ్‌తో మూడో టెస్ట్
- స్థాయికి తగ్గట్టుగా ఆడలేకపోతున్న కోహ్లీ
- స్పందించిన మాజీ క్రికెటర్ బ్రాడ్ హాగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన స్థాయికి తగ్గట్టుగా ఆడలేకపోతున్నాడు. తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో వర్షం ప్రభావం కారణంగా ఇబ్బంది పడి డకౌట్ కాగా.. రెండో ఇన్నింగ్స్‌లో (70) హాఫ్ సెంచరీ చేసినా జట్టును మాత్రం ఆదుకోలేదు. రెండో టెస్టులో 1, 17 రన్స్ చేసి పెవిలియన్ చేరాడు. స్పిన్‌ను ఉతికారేసే కోహ్లీ.. సొంతగడ్డపై స్పిన్నర్లకే వికెట్లను ఇచ్చేయడం అందరిని నిరాశకు గురిచేస్తోంది. విరాట్ ఆట తీరుపై ఆస్టేలియా మాజీ క్రికెటర్ బ్రాడ్ హాగ్ స్పందించాడు. దూకుడుగా ఆడేద్దామనే భావనతో ఔట్ అవుతున్నాడని పేర్కొన్నాడు.
Also Read: Kidambi Srikanth Marriage: పెళ్లికి రండి.. సీఎం రేవంత్‌ను ఆహ్వానించిన శ్రీకాంత్!
Also Read
- Madras High Court: పిల్లలను కనకపోతే క్రూరత్వమా?.. విడాకుల కేసుపై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
- Uttar Pradesh: ‘‘మహిళ’’గా మారేందుకు అడ్డు చెప్పిందని తల్లి దారుణహత్య..
- South Pacific: భారీ తిమింగలం ఎటాక్.. నీట మునిగిన యాచ్
- IND Vs WI: రేపు వెస్టిండీస్‌తో మూడో వన్డే.. టీమిండియాలో కీలక మార్పులు.. స్టార్ బ్యాట్స్‌మెన్ దూరం..
‘న్యూజిలాండ్‌ను భారత్ తేలిగ్గా తీసుకుంది. సొంతగడ్డపై సులువుగా విజయం సాధించవచ్చనుకుంది. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లీ దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించాడు. అగ్రెసివ్‌గా బ్యాటింగ్ చేసి రన్స్ చేయాలని చూశాడు. కివీస్ బౌలింగ్‌ను తక్కువగా అంచనా వేశాడు. షాట్లు కొట్టేటప్పుడు భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోయాడు. అందుకే స్పిన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. మూడో టెస్టులో అయినా టెక్నిక్‌ను మరింత మెరుగుపర్చుకోవాలి. టీమ్ సౌథీ బౌలింగ్‌లో రోహిత్ శర్మ ఇబ్బంది పడ్డాడు. సిరీస్ క్లీన్‌స్వీప్ కాకుండా ఉండాలంటే కోహ్లీ, రోహిత్ రన్స్ చేయాల్సిందే’ అని బ్రాడ్ హాగ్ సూచించాడు. మూడో టెస్టు శుక్రవారం నుంచి ముంబైలో ప్రారంభం కానుంది.
తాజావార్తలు
-
Madras High Court: పిల్లలను కనకపోతే క్రూరత్వమా?.. విడాకుల కేసుపై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
-
Repo Rate Hike: పండుగ పూట లోన్ EMI లు పెరుగుతాయా? అక్టోబర్ 7న రిజర్వ్ బ్యాంక్ ఏం చేయబోతుంది!
-
Uttar Pradesh: ‘‘మహిళ’’గా మారేందుకు అడ్డు చెప్పిందని తల్లి దారుణహత్య..
-
South Pacific: భారీ తిమింగలం ఎటాక్.. నీట మునిగిన యాచ్
-
IND Vs WI: రేపు వెస్టిండీస్‌తో మూడో వన్డే.. టీమిండియాలో కీలక మార్పులు.. స్టార్ బ్యాట్స్‌మెన్ దూరం..
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!