NTV Telugu Site icon

Virat Kohli: విరాట్ కోహ్లీ.. ఇలా అయితే కష్టమే: హాగ్

Virat Kohli Test

Virat Kohli Test

న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన స్థాయికి తగ్గట్టుగా ఆడలేకపోతున్నాడు. తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో వర్షం ప్రభావం కారణంగా ఇబ్బంది పడి డకౌట్ కాగా.. రెండో ఇన్నింగ్స్‌లో (70) హాఫ్ సెంచరీ చేసినా జట్టును మాత్రం ఆదుకోలేదు. రెండో టెస్టులో 1, 17 రన్స్ చేసి పెవిలియన్ చేరాడు. స్పిన్‌ను ఉతికారేసే కోహ్లీ.. సొంతగడ్డపై స్పిన్నర్లకే వికెట్లను ఇచ్చేయడం అందరిని నిరాశకు గురిచేస్తోంది. విరాట్ ఆట తీరుపై ఆస్టేలియా మాజీ క్రికెటర్ బ్రాడ్ హాగ్ స్పందించాడు. దూకుడుగా ఆడేద్దామనే భావనతో ఔట్‌ అవుతున్నాడని పేర్కొన్నాడు.

Also Read: Kidambi Srikanth Marriage: పెళ్లికి రండి.. సీఎం రేవంత్‌ను ఆహ్వానించిన శ్రీకాంత్!

‘న్యూజిలాండ్‌ను భారత్ తేలిగ్గా తీసుకుంది. సొంతగడ్డపై సులువుగా విజయం సాధించవచ్చనుకుంది. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లీ దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించాడు. అగ్రెసివ్‌గా బ్యాటింగ్‌ చేసి రన్స్ చేయాలని చూశాడు. కివీస్ బౌలింగ్‌ను తక్కువగా అంచనా వేశాడు. షాట్లు కొట్టేటప్పుడు భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోయాడు. అందుకే స్పిన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. మూడో టెస్టులో అయినా టెక్నిక్‌ను మరింత మెరుగుపర్చుకోవాలి. టీమ్ సౌథీ బౌలింగ్‌లో రోహిత్ శర్మ ఇబ్బంది పడ్డాడు. సిరీస్‌ క్లీన్‌స్వీప్‌ కాకుండా ఉండాలంటే కోహ్లీ, రోహిత్ రన్స్ చేయాల్సిందే’ అని బ్రాడ్ హాగ్ సూచించాడు. మూడో టెస్టు శుక్రవారం నుంచి ముంబైలో ప్రారంభం కానుంది.