టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియాతో గబ్బా వేదికగా మూడో టెస్టు డ్రాగా ముగియగానే విలేకరుల ముందుకు వచ్చిన యాష్.. అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు వెల్లడించాడు. సిరీస్ మధ్యలోనే అశ్విన్ సడన్‌గా రిటైర్మెంట్ ఇవ్వడంతో భారత అభిమానులతో పాటుగా క్రికెట్ ఫ్యాన్స్ షాక్‌కు గురయ్యారు. తాజాగా అశ్విన్ రిటైర్మెంట్‌పై ఆసీస్ మాజీ క్రికెటర్ బ్రాడ్ హడిన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
రిజర్వ్ బెంచ్‌పై కూర్చోబెట్టడం వల్లే ఆర్ అశ్విన్ నిరుత్సాహానికి గురై వీడ్కోలు చెప్పాడని తాను భావిస్తున్నట్లు బ్రాడ్ హడిన్ పేర్కొన్నాడు. హడిన్ తాజాగా విల్లో టాక్‌లో మాట్లాడుతూ… ‘ఆస్ట్రేలియాతో తొలి మూడు టెస్టులను ముగ్గురు విభిన్నమైన స్పిన్నర్లతో భారత్ ఆడింది. ఇది చూస్తే టీమిండియా ఎలాంటి ప్రణాళిక లేకుండానే ఆసీస్ పర్యటనకు వచ్చినట్లు అనిపించింది. ఒకవేళ ‘బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భారత్ విజయం సాధించి, అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించి ఉంటే అసలు సమస్యే ఉండేది కాదు. కానీ సిరీస్ మధ్యలోనే వీడ్కోలు పలకడం తమాషాగా ఉంది’ అని అన్నాడు.
Also Read: Niharika Konidela: నా మనసు ముక్కలైంది: నిహారిక
‘ఎక్కువ మ్యాచ్‌లకు రిజర్వ్ బెంచ్‌పై కూర్చోబెట్టడంతోనే అశ్విన్ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు నాకు అనిపిస్తోంది. ఆస్ట్రేలియాపై అద్భుతమైన రికార్డు ఉన్న స్పిన్నర్‌గా నేను బెంచ్‌పై కూర్చోలేను, నేను అత్యుత్తమ స్పిన్నర్ కాదని మేనేజ్మెంట్ అనుకున్నపుడు ఇక్కడితో ఆడటం ఆపేస్తా అని యాష్ అనుకొని ఉండొచ్చు’ అని బ్రాడ్ హడిన్ తెలిపాడు. భారత్ ఆల్‌టైమ్ గ్రేట్ క్రికెటర్లలో అశ్విన్ ఒకడు. 106 టెస్టుల్లో 537, 116 వన్డేల్లో 156, 65 టీ20ల్లో 72 వికెట్లు పడగొట్టాడు. టెస్ట్ ఫార్మాట్‌లో 3,503 పరుగులు చేసిన అశ్విన్.. 6 సెంచరీలు, 14 అర్ధ శతకాలు బాదాడు.